మారుతున్న కాలంతో పాటు యువత ఖర్చు చేసే విధానం కూడా మారుతోంది. ఈ తరం యువత కష్టపడి మంచి ఉద్యోగాల్లో ఐదంకెల, ఆరంకెల జీతాలతో స్థిరపడుతున్నారు. అదే సమయంలో ఆ జీతాన్ని విలాసాల కోసం వృథాగా ఖర్చు చేస్తూ పొదుపు విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. నెల తిరిగేసరికి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలకపోగా యువత అప్పులపై ఆధారపడుతూ ఉండటం గమనార్హం. 
 
ప్రస్తుత కాలంలో యువతలో చాలామంది విలాసాలు, టూర్లు, వీకెండ్ పార్టీలు అంటూ వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. కొందరు వేలకు వేలు సంపాదిస్తున్నా ఆ జీతాలు కూడా సరిపోక ఇంట్లో వాళ్లను డబ్బులు అడిగి తీసుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో యువత అనవసరమైన వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన వాటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వేలకు వేలు సంపాదిస్తున్నా ఒక్క రూపాయి కూడా పొదుపు చేయకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు. 
 
మరోవైపు యువతలో చాలామంది ఈజీమనీకు అలవాటు పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే వారిలో చాలామంది పేపర్లు, పోస్టర్లలో వచ్చే తప్పుడు ప్రకటనలకు రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో డబ్బు చెల్లించి మోసపోతుంటే మరికొందరు బెట్టింగ్ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యువత కష్టపడే సంపాదనలో కనీసం 30 శాతం పొదుపు చేసుకుంటే భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అదే సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తే నష్టపోవటానికి మరియు జీవితం ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సులభంగా డబ్బు సంపాదించవచ్చు అని ఎవరైనా చెబితే ఆ మాటలు గుడ్డిగా నమ్మకుండా ఉంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: