ఔను, ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత కాల, మాన పరిస్థితుల్లో ఎంతో మార్పువచ్చింది. ముఖ్యంగా మన దేశంలోని అన్ని రంగాల్లో యువత యొక్క ప్రాధాన్యత మరింతగా పెరుగుతోంది. ఇక వారిలో కొందరు మంచి విద్య, అభ్యున్నతితో ముందుకు సాగుతుంటే, ఇంకొందరు మాత్రం ఒకింత వెనుకబడే ఉన్నారు. యువత అధికంగా గల మన దేశంలో, ముఖ్యంగా కొందరు ప్రక్క దారులు పడుతూ రూల్స్ ని బ్రేక్ చెసే విధంగా ముందుకు సాగుతుండడం, కొన్ని రకాల సమస్యలకు తావిస్తోంది. అయితే అవి కుటుంబంలో సంప్ర‌దాయాలు కావొచ్చు, సామాజిక సంస్కృతులు కావొచ్చు, రాజ్యాంగ నిబంధ‌న‌లు కావొచ్చు, 

 

అలానే వాటితో పాటు ట్రాఫిక్ రూల్స్  బ్రేక్ చేయడం వంటివి కూడా కావచ్చు. ఇటువంటివి బ్రేక్ చేయడం నేటి యువ‌త స్పెషాలిటీగా మారిపోయింది. ముందుగా ఇంట్లోని పెద్ద వాళ్ల మాటను అలక్ష్యం చేస్తూ కొందరు యువతీ యువకులు తమ జీవితాలను కొంత ఇబ్బందుల్లోకి వారికి వారే నెడుతున్నారు. ఇక సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన మన దేశంలో వాటి పరిస్థితి మరింతగా దిగజారిపోయిందనే చెప్పాలి. ఎక్కువగా పాశ్చాత్య  పద్ధతులు, సంస్కృతులు పాటించడంతో పాటు, మన పెద్దలు ఏర్పరిచిన విలువలకు పూర్తిగా తిలోదకాలిస్తూ మెల్లగా తమను తామే నాశనం చేసుకుంటున్నారు. 

 

వాటితో పాటు రాజ్యాంగ బద్దంగా కూడా కొన్ని చర్యలను పాటించకపోవడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ ని సైతం పట్టుచుకోవడం లేదు. దానివలన మన దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవడం, అలానే ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కూడా పెరగడం జరుగుతోంది. అయితే ఈ విధంగా యువతీ యువకులు పలు తప్పుడు విధానాలు అనుసరిస్తూ తమ జీవితాలను సమస్యల వలయంలోకి నెట్టడం వలన అవి వారి పాలిటి శాపాలు అవడంతో పాటు రాబోయే తారలపై కూడా అవి బాగా ప్రభావం చూపే అవకాశం కాపాడుతోందని అంటున్నారు మానసిక నిపుణులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: