నిన్న మనం ఈతరం కుటుంబం గురించి మాట్లాడుకున్నాం.. ఇప్పుడు ఈతరం యువత గురించి మాట్లాడుకుందాం. ఈ తరం యువత ఎంత అద్భుతంగా విజయాలు సాధిస్తుంది.. ఎంత కష్టపడి చదువుతుంది అనేది ఇక్కడ తెలుసుకుందాం. పిల్లలు పుట్టిన మూడేళ్ళ నుండి ప్రీ కేజీ, ఎల్కేజి, యూకేజీ అంటూ వారికీ 23, లేదా 24 ఏళ్ళు వయసు వచ్చేవరకు.. 

 

చిన్నప్పుడు కొట్టి.. పెద్దయ్యాక తిట్టి.. మరికాస్త పెద్దయ్యక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి వారిని టార్చర్ చేస్తుంటాం.  అలా అంతా టార్చర్ చేసిన సరే మన ముందు నటించి.. పక్కకు వెళ్ళాక చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలు చదువు ఎందుకు లుక్కు ఉంటె సాలు అనుకుంటున్నారు ఈ కాలం యువత. 

 

నూరులో 90శాతం మంది లక్కు ఉంటె చాలు అన్ని మనం అనుకున్నట్టే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అని కామెంట్లు చేస్తున్నారు. చ‌దువుకున్న వారంతా పెద్ద పెద్ద జాబులు చేసి సంపాయిస్తున్నారంటే.. ఈ యువ‌త న‌మ్మ‌డం లేదు. కేవ‌లం ల‌క్కుపైనే చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఎం అంటే.. 

 

చదువుకున్న వారంతా ఉద్యోగాలు చేస్తారు.. చదువులేని వారంతా ఉద్యోగాలు ఇస్తారు అని కామెంట్లు చేస్తున్నారు నేటి యువత. అంతేకాదు.. ఈ కాలం యువతకు చదువు కంటే కూడా జాతకాలను ఎక్కువ నమ్ముతున్నారు. ఆన్‌లైన్‌లో జాత‌కాలు చూసుకుంటున్న వారిలో యువ‌త సంఖ్య పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇది నేటి తరం యువత పరిస్థితి. 

మరింత సమాచారం తెలుసుకోండి: