నాటి తరానికి నేటి తరానికి ఎంతో తేడా ఉంది. నాటితరం మద్యం అంటే కిలోమీటర్ దూరం ఉండేవాళ్ళు... కానీ నేటి తరానికి చెందిన వాళ్లు మాత్రం మద్యానికి బానిసై ఒక్క నిమిషం అయిన  ఉండలేని పరిస్థితి నెలకొంది. కేవలం అబ్బాయిలే కాదు నేటితరంలో అమ్మాయిలు కూడా మందు తాగుతుండటం గమనార్హం  .అమ్మాయిలు మందు తాగే కల్చర్  రోజురోజుకు భారతదేశంలో ఎక్కువ అయిపోతుంది. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాల్లో చేసినట్టుగానే ఇక్కడ కూడా సాంప్రదాయంగా ఉండాల్సిన అమ్మాయిలు మందువేసి చిందులు వేస్తున్నారు . నాటి తరంలో అమ్మాయిలంటే అందమైన  పొడవైన జడతో ఆకర్షించే వస్త్రధారణతో... అమ్మాయిని చూస్తే చాలు తెలుగు సంప్రదాయం గుర్తొచ్చేలా... తెలుగుతనం ఉట్టిపడేలా ఉండేవారు. కానీ నేటి రోజుల్లో అవి ఏవీ కనిపించడం లేదు. 

 

 ఇక పుబ్బులు, కబ్బులు అంటూ   పెరిగిపోవడంతో... రోజూ వెళ్లి మందు తాగుతూ చిందులేస్తూ  అదే లోకంగా బతికేస్తున్న అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. నాటి తరంలో మద్యం అంటే ఆమడ దూరంగా ఉండి ఆడాళ్లు ... ఇప్పుడు మాత్రం అలాంటి పట్టింపులు ఏవి పెట్టుకోవడం లేదు. ఇష్టం వచ్చినప్పుడు మద్యం తాగడం ఇష్టం వచ్చినప్పుడు సిగరెట్లు తాగడం చేస్తున్నారు. ఆధునిక పోకడలో మంచి అలవాట్లు అలవరచుకుంటే మంచిది కానీ ఇలాంటి చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు మరిన్ని సమస్యలు వచ్చిపడతాయి. ఇప్పటి అమ్మాయిలకు నాటి తరం అమ్మాయిలకు అసలు ఎక్కడా పొంతన ఉండదు. 

 


 నాటి తరం అమ్మాయిలు కనీసం ఇంటి నుంచి కాలు  బయట పెట్టాలి అంటే భయపడే వారు కానీ... నేటితరం అమ్మాయిలు మాత్రం కాలు బయట పెట్టడం ఏంటి ఏకంగా  క్లబ్బులు పబ్బులు అంటూ పాశ్చాత్య పోకడలు పోతూ తమ మూలాలను కూడా మరిచి పోతున్నారు. పాశ్చాత్య పోకడలను అలవర్చుకోవడం మంచిదే కానీ ఎంతవరకు అలవర్చుకోవాలి అంతే అలవర్చుకోవాలి... కానీ నేటి తరం యువతుల్లో  మాత్రం అది శృతి మించి పోతుంది. పాశ్చాత్య పోకడలకు అలవాటుపడి భారతదేశ సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు నేటితరం అమ్మాయిలు.

మరింత సమాచారం తెలుసుకోండి: