పె
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అందరు అంటారు.. పాతకాలంలో అయితే ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండానే పెళ్లిళ్లు జరిగిపోయేయి.. పెళ్ళికి ముందు మాట్లాడుకోవటం కానీ, ఫోన్లు చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమి పాత కాలంలో లేవు. తల్లి తండ్రి ఎవరిని పెళ్లి చేసుకోమని చెప్తారో వాళ్ళని చూడకుండా మరి పెళ్లి చేసుకునే వాళ్ళు. కానీ ఇపుడు కాలం మారింది పెళ్లికి ముందే మాట్లాడుకోవటం, చూసుకోవటం, ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ అభిప్రాయాలు ఇద్దరికీ నచ్చిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

 

కానీ ఇప్పుడు ఒక పెళ్లి పీటలదాకా వచ్చి ఆగిపోయింది.దానికి కారణం ఏంటో తెలిస్తే అందరు ముక్కు మీద వేలు వేసుకుంటారు. వివరాలలోకి వెళితే బెంగళూరుకు చెందిన రాజు (పేరు మార్చాం) వయసు 35 సంవత్సరాలు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి ఓ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా అమెరికాలో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రమ్య (పేరు మార్చాం)తో పరిచయం ఏర్పడింది. ఆగస్ట్‌లో వారి మధ్య ఫోన్ కాల్స్ ప్రారంభం అయ్యాయి. ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఆగస్ట్ 13న ఆమె అమెరికా నుంచి బెంగళూరు వచ్చింది. ఇద్దరూ కలసి ఓ స్టార్ హోటల్‌లో కూర్చుని మాట్లాడుకున్నారు. అనంతరం రమ్య చెప్పడంతో ఆమె సోదరి లక్ష్మిని కలవాలని చెప్పడంతో ఆమె నుంచి పెళ్లికి అనుమతి తీసుకున్నాడు.

 

అనంతరం ఆగస్ట్ 26న రాజు తల్లిదండ్రులు బెంగళూరులోని రమ్య ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. సెప్టెంబర్ 9న రాజు, రమ్య ల నిశ్చితార్థం జరిగింది.2020 జనవరి 30న పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే, తిరుపతిలోనే పెళ్లి జరగాలని రమ్య కుటుంబం కండిషన్ పెట్టింది. అయితే, తమకు ఎక్కువ మంది బంధువులు బెంగళూరులోనే ఉన్నారని, వేదికను నగరంలోనే ఏర్పాటు చేయాలని కోరినా అందుకు వారు నో చెప్పారు. దీంతో తప్పని పరిస్థితుల్లో తిరుపతిలోనే పెళ్లికి రాజు కుటుంబం అంగీకరించింది.



తిరుపతిలో పెళ్లి కోసం రాజు ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. బంధువుల కోసం 70 రూమ్‌లు బుక్ చేశాడు. అందుకు రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించాడు. దీంతోపాటు బట్టలు, గిఫ్ట్‌ల కోసం మరో రూ.4లక్షలు ఖర్చు చేశాడు. ఈ క్రమంలో రమ్య మళ్లీ జాబ్ మీద అమెరికా వెళ్లిపోయింది.



అక్టోబర్‌లో ఓ రోజు రమ్య . రాజు తండ్రికి ఫోన్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు తెలిపింది. దీంతో రాము షాక్‌కి గురయ్యాడు. అక్టోబర్ 23న రమ్య కి ఫోన్ చేశాడు. ఆరోజు ఫోన్ లిఫ్ట్ చేసిన రమ్య ..రాజు కు ఒక వింతయినా మాట చెప్పి పెళ్లి కాన్సల్ అని చెప్పింది... అది ఏమంటే రాజుకి "గద్దముక్కు" ఉందని అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు వెటకారంగా చెప్పిందట..

ఇన్ని నెలలు ఒకరిని ఒకరు చూసుకుని, మాట్లాడుకుని తీరా పెళ్లి కుదిరిక "ముక్కు" బాలేదని కారణంతో పెళ్లి కాన్సల్ చేయడం పై పెళ్ళికొడుకు తరుపు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు... రమ్య ఉద్దేశపూర్వకంగా మోసంచేసిందని కేసు పెట్టాడు రాజు. రమ్య పై క్రిమినల్ కేసు నమోదు చేయమని కోర్టు ఆదేశించింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: