26 ఏకాదశులలో ముక్కోటి ఏకాదశిని పర్వదినంగా పరిగణిస్తారు. అయితే, ఈ రోజు అనగా జనవరి 6వ తారీఖున ముక్కోటి ఏకాదశి పర్వదినం అవ్వగా ప్రజలందరూ దేవుడి గుళ్లకు వెళ్తున్నారు. ఏకాదశి అనే దానిని ప్రతి నెలలో మనం ఒక పర్వదినంగా భావిస్తాం. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశిని పరమ పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం అని అంటారు. అదేవిధంగా, 24 ఏకాదశులు ఉన్న అత్యంత ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమని భావిస్తుంటారు. అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది.


ఈ పర్వదినం రోజున మహావిష్ణువు గరుడ వాహనాన్ని అధిరోహించి మూడు కోట్ల దేవదేవతలతో భూలోకానికి వచ్చి.. భక్తులకు దర్శనమిచ్చి, కోరికలను తీరుస్తారని ప్రజల నమ్మకం. అందుకే ఈ పర్వదినం రోజున ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని విశ్వసించే భక్తులు వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజామున నుండే ఆలయాలకు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి అనేక మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.


భారతదేశం నలుమూలల నుంచి తిరుమల తిరుపతి స్వామివారి దర్శనార్థం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. నాలుగున్నర గంటల సమయం నుంచి 90 వేల మంది భక్తులు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద దర్శనం చేసుకోవడానికి వేచి చూస్తున్నారు. మరొక వైపు తూర్పుగోదావరి జిల్లాలోని వైష్ణవ ఆలయాలన్ని తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించక ముందు వచ్చే ఏకాదశి ని అత్యంత పవిత్రమైనదిగా భావించడం వలన ఉత్తరద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు ఆశిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజునే అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశించాడని చెబుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: