బ్రిటన్ కి చెందిన రేన్ హార్డ్ అనే 36 ఏళ్ళ వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టారు. అతడి తరుపు వాదనలు మొదలయ్యాయి. కోర్టు హాలులో అందరూ ఉన్నారు. వాదనలు జరుగుతున్న సమయంలో అతడిపై వచ్చిన నేరాన్ని లాయల్ చదివి వినిపించాడు. ఈ వ్యక్తి సుమారు 150 మంది అబ్బాయిలని రేప్ చేశాడు అనగానే హాలులో అందరూ ఆశ్చర్యంగా అతడివైపు చూశారు.

 

ఇండోనేషియా కి చెందిన ఈ నీచుడు బ్రిటన్ లోని మాచేస్టర్ లో ఉండేవాడు,. అతడు ఓ విద్యార్ధిగా ఉన్నప్పటి నుంచీ కూడా తోటి విద్యార్ధులకి డ్రగ్స్ అలవాటు చేసేవాడు. వాళ్ళు డ్రగ్స్ తీసుకుని మత్తులో ఉన్న సమయంలో అత్యాచారం చేసేవాడని విచారణలో తేలింది. ఇలా గడిచిన రెండున్నరేళ్ళుగా అతడు దాదాపు  150 మందిపై అత్యాచారం చేశాడని పోలీసులు సాక్ష్యాధారాలు కూడా సేకరించారు.

 

అంతేకాదు అతడి దగ్గర 3.26 డిజిటల్ డైరీ డేటాని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అతడు రేప్ చేసిన వారి వీడియోలని తీసి బ్లాక్ మెయిల్ కూడా చేసేవాడని, డబ్బులు భారీగా వాసులు చేసేవాడని తేలింది. ఈ విషయాలు ఆధారాలతో సహా విన్న కోర్టు అతడిని అత్యంత నీచమైన రేపిస్ట్ అంటూ బిరుదు కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చిచ్చి చెండాలం ఇలాంటి దరిద్రుడిని ఎక్కడా చూడలేదు అంటూ తెగ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు..

మరింత సమాచారం తెలుసుకోండి: