స్వామీ వివేకానంద.. ప్ర‌తీ భార‌తీయుడు విని తెలుసుకోవాల్సిన గొప్ప దేశ‌భ‌క్తుడి చ‌రిత్ర‌. తన అద్భుత ప్రసంగంతో పాశ్చాత్యుల హృదయాలను సైతం చూరగొన్న భారతీయ తత్వవేత్త, గొప్ప మేధావి స్వామి వివేకానందుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. 1902 జూలై 4వ తేదీన బ్రిటీషు పరిపాలనలోని బెంగాలు ప్రెసిడెన్సీ లోని బేలూరులోని రామకృష్ణ మఠంలో వివేకానందుడు మరణించారు. అప్పుడు ఆయన వయస్సు 39 ఏళ్లు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినం జనవరి 12వ తేదీని.. 1984వ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తోంది. 

 

నరేంద్ర నాథుడు కలకత్తా, బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశంలో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వివేకానందునికి చిన్నప్పటి నుంచే రోజూ ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా ముందుండేవాడు. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష మరియు ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు.  దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగినాయి.

 

అలా మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. ఈ స‌మ‌యంలోనే న‌రేంద్రుడుకి రామకృష్ణ పరమహంసతో ద‌గ్గ‌ర పరిచయం ఏర్ప‌డింది. అయితే నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను బి.ఎ పరీక్షకు తయారవుతున్నాడు. ఇక 1884లో బి.ఎ పాసయ్యాడు. దీంతో అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా ఓ పిడుగు లాంటి వార్త తెలిసింది. 

 

అదే అత‌ని తండ్రి మరణించాడని. దీంతె ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది కోర్డును కూడా ఆశ్రయించారు. ఈ క్ర‌మంలోనే నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. అలాంటి స‌మ‌యంలో రోజుకొకపూట భోజనం దొరకడం కూడా గగనమైంది. ఈ క్ర‌మంలోనే నరేంద్రుడు చాలారోజుల పాటు పస్తులుండి మ‌రీ తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు. ఇంత దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. ఇక ఆ త‌ర్వాత నరేంద్రుడు కొద్దిరోజులపాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. 

 

ఇంత‌లోనే  గురువు రామ‌కృష్ణ ఆరోగ్యం క్షీణించింది. దీంతో రేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. అయితే రామ‌కృష్ణ క్యాన్సర్ వ్యాధితో మ‌ర‌ణంచాడు. రామ‌కృష్ణ చివ‌రి కోరికాగా.. ఆయ‌న శిష్యులందరూ కలిసి బరనగూర్‌లోమి ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువసన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి. ప్రజలకు సేవ చేయడం , ముక్తిని సాధించడం. ఈ క్ర‌మంలోనే నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: