ఆధునిక కాలంలో మనిషికి ఎన్నో బాధలు.. బాధలు, చికాకులు లేని, ఇబ్బందులు, ఇక్కట్లు లేని మనిషంటూ ఈ భూమి మీద ఉండడు. మరి ఆ బాధ ఎలా పోగొట్టుకోవాలి. మనసు ఉన్న బాధ చెప్పుకుంటే తీరుతుందని అంటుంటారు. మరి ఒకరి బాధ వినే ఓపిక ఎవరికి ఉంది. విన్నా.. సానుకూలంగా స్పందిస్తారా.. సమస్యకు పరిష్కారం చెబుతారా.. కానీ ఈ లోకంలో బాధల పట్ల సానుభూతి చూపించేవారి కంటే.. ఎత్తిపొడిచే వారు.. సూటిపోటి మాటలు చెప్పేవారే ఎక్కువ.

 

మరి దీనికి పరిష్కారం ఏంటి.. ఏముంది.. మన బాధలు ఒక నోట్ బుక్ లో రాసుకోవాలి. మనసులో బాధ చెప్పుకుంటేనే కాదు. రాసుకున్నా బాధ తగ్గుతుంది. మనలను ఒత్తిడికి గురిచేస్తున్న పరిస్థితులను, సంఘటనలను ఆందోళనలను రాసుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుంది. ఊరట లభిస్తుంది.

 

అంతే కాదు.. ఇలా రాసుకుంటే మనకు ఏకాగ్రత కూడా పెరుగుతుందట. అంతే కాదు. పనులను మరింత మెరుగ్గా, త్వరగాపూర్తిచేయటానికి ఇలా రాసుకోవడం చాలా ఉపయోగపడుతుందట. అదేపనిగా ఏదైనా విషయం మిమ్మల్ని వేధిస్తుంటే.. మనసులోని భావాలకు అక్షర రూపం ఇవ్వండి. మెదడు, మనసు తేలికపడతాయంటున్నారు మానసిక నిపుణులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: