స్వామి వివేకానంద ఒక గొప్ప వ్యక్తి. వాస్తవానికి, ఈ మహానుభావుడు లాంటి వారు ఒకేసారి పుడతారని చెప్పుకోవచ్చు. 1863 జనవరి 12న జన్మించిన స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఈయనకు చిన్నతనం నుండే ఎంతో ధైర్యం, ఏకాగ్రత ఉండేవి. ఒకానొక సందర్భంలో అతను ధ్యానం చేస్తున్నపుడు ఒక పెద్ద పాము అతడి చుట్టే తిరగసాగింది.. దాంతో వివేకానంద స్నేహితులు పాము, పాము అంటూ గగ్గోలు పెట్టినప్పటికీ అతను మాత్రం కొంచెం కూడా చలించకుండా అలానే ధ్యానం కొనసాగించారు. ఇది అతని ఏకాగ్రతకు నిదర్శనం. ఇంకా కొన్ని అద్భుతమైన సంఘటనను కింద చదివి తెలుసుకుందాం.

 

సంఘటన-2

 


ఒకరోజు అమెరికాలో నలుగురు యువకులు.. నీటిలో ఉన్న గుడ్ల పెంకులను తుపాకీతో షూట్ చేయాలని తెగ ప్రయత్నిస్తుంటారు. ఇది గమనించిన స్వామి వివేకానంద.. వారి వద్ద నుంచి తుపాకిని తీసుకొని 12 సార్లు కాలుస్తారు. అయితే, కాల్చిన ప్రతి బుల్లెట్ గుండు గుడ్ల పెంకులను తాకుతుంది. దాంతో, అక్కడున్న యువకులు.. ఇంత గొప్పగా కాల్చడం మీకెలా సాధ్యమైందని ప్రశ్నించగా... స్వామి వివేకానంద మాట్లాడుతూ... 'చూడండి పిల్లలు. నేను ఇదే మొదటిసారి గన్ పేల్చడం. మీరు ఏం చేస్తున్నారో దానిపై మీ ఏకాగ్రతను పూర్తిగా ఉంచినప్పుడు, మీ మనసుని మీ లక్ష్యం పైనే కేంద్రీకరించినప్పుడు.. గురి ఎప్పుడూ తప్పదు', అని చెబుతారు.


సంఘటన-2


ఒకరోజు పీటర్ అనే ఒక తెల్లజాతి ప్రొఫెసర్ బల్లమీద కూర్చొని భోజనం చేస్తుంటాడు. అప్పుడు స్వామి వివేకానంద తన ఆహారాన్ని ఒక ప్లేట్ లో పట్టుకొని వచ్చి పీటర్ పక్కన కూర్చుంటారు. వివేకానంద తన పక్కన కూర్చున్నందుకు ద్వేషిస్తూ పీటర్ ఇలా అంటాడు...' మిస్టర్. వివేకానంద మీకు ఒక విషయం అర్ధం కావట్లేదు. ఒక పంది, ఒక పావురం కలిసి కూర్చోకూడదు', అని అంటాడు.


దాంతో స్వామి వివేకానంద స్పందిస్తూ... 'మీరేం బాధపడకండి, ప్రొఫెసర్. నేను ఎగిరిపోతానులే', అంటూ వేరే బల్ల వద్దకి వెళ్లి అక్కడ కూర్చోంటారు. దీంతో, నన్నే పంది అంటావా నువ్వు అని కోపంగా స్వామి వివేకానంద వైపు చూస్తూ అతనిపై పగబడతాడు పీటర్.


మరుసటి రోజు క్లాస్ జరుగుతున్నపుడు స్వామి వివేకానందాని ఏదో ఒక రకంగా అవమానించాలని అతనిని ఇలా ప్రశ్నిస్తాడు... 'మిస్టర్. వివేకానంద.. మీరు ఒక వీధిలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక సంచిలో డబ్బులు ఉండి.. మరొక దాంట్లో జ్ఞానం ఉంటే.. ఆ రెండిటిలో కేవలం ఒక్కటే తీసుకోవాలంటే.. మీరేం తీసుకుంటారు? అని ప్రశ్నిస్తాడు.


'నేను డబ్బుల సంచి తీసుకుంటాను, ప్రొఫెసర్', అని వివేకానంద సమాధానమిస్తారు.


'నీ ప్లేస్ లో నేనుంటే జ్ఞానం ఉన్న సంచిని తీసుకుంటా', అని నవ్వుకుంటూ చెబుతాడు పీటర్.


'ఎవరికి ఏది లేదో అదే కావాలని కోరుకుంటారు. నీకు జ్ఞానం లేదు కాబట్టి', అంటూ వివేకానంద సూపర్ పంచ్ విసురుతారు. దాంతో, క్లాసులో ఉన్నవారంతా పకపకా నవ్వుతారు. అప్పుడు పీటర్ కి కోపం విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని రోజుల తరువాత పరీక్షల ముగుస్తాయి. అందరి విద్యార్థులను పిలిచి ఎక్సమ్ పేపర్స్ ఇస్తుంటాడు పీటర్. ఈ క్రమంలోనే వివేకానందాని పిలిచి అతడికి ఆన్సర్ పేపర్ ఇస్తాడు పీటర్. ఆ పేపర్ లో మార్కుల స్థానంలో 'ఇడియట్' అని రాసి ఉంటుంది. వివేకానంద కోసేపు ఆగి.. తరువాత పీటర్ దగ్గరకు వెళ్లి... 'ప్రొఫెసర్, మీరు మీ సంతకం పెట్టారు కానీ మార్కులు వేయడం మర్చిపోయారు', అంటూ ఎంతో మర్యాదపూర్వకంగా చెబుతారు. దాంతో, పీటర్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. ఇంకా, ఇలాంటి సంఘటనలు స్వామి వివేకానంద జీవితంలో జరిగాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: