ఈ భూమి మీద నడిచిన మానవులలో స్వామి వివేకానంద చాలా తెలివైన వారిని ప్రపంచమే కొనియాడుతుంది. అమెరికాలో బాగా చదువుకున్న వారు కూడా వివేకానంద చెప్పినటువంటి యోగ సూత్రాలను పాటిస్తూ.. గొప్ప జ్ఞానం ఈ తరాలకు సమర్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంటారు. అతని జీవిత చరిత్ర గురించి చదివితే.. ఎంత చెడ్డవారైనా కొన్ని సంవత్సరాల్లోనే మంచి వ్యక్తిత్వం కలవారైతారు.


ఇక విషయానికి వస్తే.. ఒకానొక సందర్భంలో స్వామి వివేకానంద హిమాలయల్లో పర్యటిస్తుంటారు. అయితే, వారి పర్యటనలో భాగంగా ఒకరోజు.. ఒక నదిని దాటాల్సివస్తుంది. వివేకానంద అక్కడికి చేరుకొనేలోపు అతను చూస్తుండగానే చివరి పడవ కూడా వెళ్ళిపోతుంది. దాంతో, ఆ నది ఒడ్డున కూర్చొని పడవ కోసం వేచిచూస్తుంటారు వివేకానంద. కొంతసేపటికి ఒక సాధువు.. స్వామి వివేకానంద వద్దకు వచ్చి.. 'బాబు, నీ పేరేంటి' అని ప్రశ్నిస్తారు.


'స్వామి వివేకానంద', అని వివేకానంద సమాధామిస్తారు.


'ఓహో, నువ్వేనా ఆ స్వామి వివేకానంద? విదేశీ భాషలు మాట్లాడి పెద్ద గొప్పవాడిగా మీరు ఫీలవుతుంటారంటగా. సంతోషం' అని స్వామి వివేకానంద అని వెక్కిరిస్తారు.


ఇంకా మాట్లాడుతూ... ' మీరు ఈ నదిని దాటి గలరా? చూడు.. నేను ఈ నదిని కాలినడకన దాటేస్తాను.' అంటూ దాటి చూపిస్తాడు ఆ సాధువు.


అది చూసిన స్వామి వివేకానంద ఆశ్చర్యపోతూ... 'అద్భుతం. ఇటువంటి గొప్ప సాధన నేర్చుకోవడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? అని సాధువుని ప్రశ్నిస్తారు.


అప్పుడు ఆ సాధువు తల పైకెత్తుకుని గర్వంగా ఫీల్ అవుతూ... 'ఇది అంత సులభం కాదు. గత 20 సంవత్సరాలుగా హిమాలయాల్లో ఉండి కఠినమైన తపస్సు చేయటం ద్వారా నేను ఈ అతి గొప్ప విద్య సాధించాను.' అని చెబుతారు.


అప్పుడు స్వామీ వివేకానంద స్పందిస్తూ...' 5 నిమిషాల్లో ఒక పడవ చేయగలిగే పనిని మీరు చేయడానికి 20 సంవత్సరాల జీవితాన్ని వృధా చేశారా? ఆ జీవిత సమయాన్ని ఏదో పేదలకు సేవ చేయడానికి ఉపయోగించవచ్చు కదా? మీరు సాధన చేసి జీవితం మొత్తం వృధా చేశారు. ఈ కాదు విద్యా!! ఇది కాదు జ్ఞానం. ఒకరికి ఉపయోగపడేదే అసలైన జ్ఞానం', అని చెబుతారు.



అప్పటివరకు ఎగిరెగిరి పడిన సాధువు ఒక మాట కూడా తిరిగి మాట్లాకుండా తలదించుకొని వెళ్ళిపోతాడు. ' ప్రజలకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లే', అని స్వామి వివేకానంద భావిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: