అప్పట్లో స్వామి వివేకానంద కుటుంబ సభ్యులు అతనికి ఒక పెళ్లి సంబంధం కుదిరించారు. అయితే, ఇది తెలిసిన రామకృష్ణ పరమహంస కాళికా దేవి పాదాలపై పడి.. 'తల్లి, నరేంద్ర నాథ్ ని పెళ్లి అనే నరకంలో పడేట్లు చేయకండి', అంటూ బాగా ఏడుస్తారు. అయితే, కొన్ని గంటల సమయంలోనే ఆ పెళ్లి సంబంధం చెడిపోతుంది. కొన్నేళ్ల తరువాత స్వామి వివేకానంద తండ్రి గారు చనిపోతారు. అప్పుడు వాళ్లు బాగా అప్పుల్లో కూరుకుపోతారు. ఒకానొక సందర్భంలో వివేకానంద ఆహారం లేక బాగా క్షిణిస్తాడు. అది గమనించిన ఒక ధనిక విధవరాలు మాట్లాడుతూ... 'నీకు కావాల్సినన్ని బంగారు నాణేలు ఇస్తాను, డబ్బులు కూడా ఇస్తాను. మరి బదులుగా నాకు కావాల్సింది ఇస్తావా?' అని అడుగుతుంది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన వివేకానంద.. 'నీచురాల, నీ వచ్చే జన్మ గురించి ఒకసారి ఆలోచించు', అని ఆమెకు చివాట్లు పెట్టి వెళ్ళిపోతారు.


స్వామి వివేకనంద పెరిగి పెద్దవాడైన తరువాత అతని తేజస్సుకు, తెలివికి ఎంతోమంది యువతులు ఫిదా అయిపోయేవారు. నన్ను పెళ్లి చేసుకుంటారా, నన్ను లవ్ చేస్తారా అంటూ ఎంతో మంది యువతులు అతని వెనుక పడేవారు. ఒకరోజు ఒక రిచ్ అమెరికా అమ్మాయి స్వామి వివేకానంద వెంటపడి అస్సలు వదలకుండా 'నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా' అంటూ బలవంతం చేసింది. 'నాకు మీ లాంటి తెలివైన కుమారుడు పుట్టాలి. మనం పెళ్లి చేసుకుందాం. నాకు ఒక కుమారుడిని ప్రసాదించండి', అని బాగా వేడుకుంది.


'మీకు తెలివైన కుమారుడైనా కావల్సింది' అని వివేకానంద ప్రశ్నించగా.. 'అవును' అంటూ ఆమె తల ఊపుతుంది.



అప్పుడు స్వామి మాట్లాడుతూ... 'మై డియర్ లేడీ, నేను మీ కోరికను అర్ధం చేసుకున్నాను. పెళ్లి చేసుకోవడం.. ఒక బాలుడిని కనడం.. మళ్ళీ అతను తెలివైన వాడో కాదో తెలుసుకునే లోపు చాలా టైం పడుతుంది. అసలు, నిజంగా తెలివైన వాడు పుడతాడో లేదో కూడా గారంటీ లేదు. పెళ్లికి బదులుగా నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. అలా చేస్తే నీ కోరిక వెంటనే తీరుతుంది', అని చెబుతారు.


ఆమె ఏంటబ్బా ఆ ఉపాయం అనుకుంటూ సందిగ్ధంలో పడిపోతుంది.


అప్పుడు వివేకానంద... 'నన్ను మీ బిడ్డగా స్వీకరించండి. మీరు మా అమ్మ గారు. ఇప్పుడు తెలివైన కుమారుడు కావాలనే మీ కోరిక తీరిపోయిందిగా?' అని అంటారు. దాంతో ఆమె నోట మాట రాదు. నిజానికి, అతని తెలివికి, తేజస్సుకు రిచ్ అండ్ బ్యూటిఫుల్ గరల్స్ పెళ్లి చేసుకోమని అడిగారు. కానీ స్వామి వివేకానంద.. 'మానవ జన్మ దేవుడు పరిపూర్ణత తెలుసుకోవడం కోసమే' అని వారికి వివరించి చెప్పేవారు.



మరింత సమాచారం తెలుసుకోండి: