చేసే పని ఎలాంటిది అయినా ఏకాగ్రతతో చెయ్యాలి.. అప్పుడే విజయం సాధిస్తాం అని మన పెద్దలు చెప్తుంటారు. నిజమే... ఏ పని చేసిన ఏకాగ్రతతో చెయ్యాలి. ఓ మహానుభావుడు చెప్పాడు.. చేసేది చిన్న పనైనా, పెద్దదైన ఏకాగ్రతతో చెయ్యడం ముఖ్యం అని.. ఇది చెప్పింది ఆర్ధర్ కాటన్. 

 

ఏ పని అయినా.. అది పిండి రుబ్బడం అయినా.. వంట చెయ్యడం అయినా.. చెప్పులు కుట్టడం  అయినా.. కవిత రాయడం అయినా.. చదవడం అయినా.. ఏదైనా సరే ఏకాగ్రతతో చేస్తే నీకంటూ ఓ గుర్తింపు వస్తుంది. ఆలా కాదు అని అందరూ చేసినట్టే నువ్వు చేస్తే ఎం లాభం. అందరూ గొర్రెలు.. నువ్వు కాదు కదా! 

 

గొర్రెల గుంపులో మనం ఒకరు అవ్వకూడదు.. మనం అందరి కంటే భిన్నంగా ఉండాలి. ఆలా ఉండాలి అంటే.. నువ్వు ఏ పని చేస్తున్నావో ముందు నీకు తెలియాలి.. ఆ పని చిన్నది అయినా సరే ఏకాగ్రతతో చేశావు అంటే ఆ పనికి నువ్వు రాజు అవుతావు.. నీ వద్దకు నలుగురు వచ్చి నేర్చుకున్నప్పుడు నువ్వు గురువుగా మారుతావు.. అది ఏ పని అయినా నీకంటూ మంచి గుర్తింపు వస్తుంది. 

 

అప్పుడు పెద్ద పని చేసే వాళ్లకు నీకు పెద్ద తేడా ఉండదు.. నువ్వు నీ పనిలో గొప్పవాడివి అవుతావు.. ఉన్నత శిఖరాలను తాకుతావు. అందరికి ఆదర్శంగా నిలుస్తావు. ఇలా నిలవాలి అంటే ముందు మీరు చేసే పని మీద ఏకాగ్రత పెట్టాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: