ఈ ఆధునిక ప్రపంచంలో అందరు వెరైటీ టేస్ట్ కురుకుంటున్నారు. చాలా మంది జంక్ ఫుడ్స్ కి అలవాటు పడిపోయారు. అందులో ముఖ్యంగా బర్గర్ ఒకటి. వెరైటీగా తినాలని కోరుకొనే వారికి ఒక స్పెషల్ డిష్ బర్గర్. కాలేజి పిల్లల నుండి, ఆఫీస్ కు వెళ్ళే వారి వరకూ ఇంకా హౌస్ వైఫ్ వరకూ బర్గర్ తినడం అంటే చాలా ఇష్టం. కొంతమంది గారంటీ కూడా ఇస్తారు వాళ్ళ ప్రొడక్ట్స్ కి.. మా ప్రొడక్ట్స్ ఎన్నేళ్లయినా చెక్కుచెదరవ్..ఎటువంటి డ్యామేజ్ జరగవ్..మేము గ్యారంటీ..

 

ఇది చాలామంది వారి ఉత్పత్తులను సేల్ చేసేటప్పడు చెప్పే మాట. వస్తువుల విషయంలో ఓకే  కానీ ఆహార పదార్థాల విషయంలో కూడా చెప్తారు.. కానీ ఏమి కంపెనీ ఇలాంటి హామీ ఇవ్వలేదు.. అసలు వాళ్ళకే తెలియదు ఎన్ని సంవత్సరాలు అయిన మా ప్రోడక్ట్ అయిన బర్గర్ చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది అని. "20 సంవత్సరాల క్రితం బర్గర్ నేటికీ చెక్కు చెదరకుండా ఇప్పుడు చేసినట్లుగానే ఉంది " అన్న విషయం...

 

మీరు విన్నది నిజమే ఎన్నో ఏళ్ల తరబడి చేసిన బర్గర్ ఇప్పటికి అలానే ఉంది. వివరాలలోకి వెళితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం.. 1999లో అమెరికాలోని ఓ షాప్‌లో డేవిడ్ విపిల్ ఒక బర్గర్ కొనుక్కున్నాడు. అది కొన్నది కూడా లగాన్‌లోని ఓ స్టోర్‌లో.... మెక్‌డొనాల్డ్స్ బర్గర్ కొన్నానని చెబుతున్నాడు డేవిడ్.వాస్తవానికి దానిపై ఎంజైమ్స్ ఎక్స్‌పరిమెంట్ చేద్దామని అనుకున్నాడట.అందుకే బర్గర్ కొన్నాడట. కానీ దాన్ని ఓ కోట్ పాకెట్‌లో పెట్టి.. దాన్ని తన కారు వెనుక సీటులో పడేసి మర్చిపోయాడతను. అయితే ఆ తర్వాత అతడి భార్య ఆ కోట్‌లో బర్గర్ ఉన్న విషయం మర్చిపోయి..

 

దాన్ని భద్రంగా ఇంట్లోకి తెచ్చి సెల్ఫ్‌లో దాచింది. ఈ విషయం డేవిడ్‌కు తెలియదు.డేవిడ్ కూడా బర్గర్ కొన్నాడన్న విషయం మర్చిపోయి పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్లు లగాన్ నుంచి సెయింట్ జార్జ్ ప్రాంతానికి షిఫ్ట్ అయ్యారు. మళ్లీ రెండేళ్ల తర్వాత పాత ఇంటికి వచ్చారు. అప్పుడు కూడా ఆ కోట్‌ను తాను చూడలేదని చెబుతున్నాడు డేవిడ్. తన భార్య దాన్ని ఎప్పుడో పడేసి ఉంటుందని అనుకున్నానని అన్నాడు. 2013లో తొలిసారి అనుకోకుండా ఆ కోట్‌ను తీసిన డేవిడ్.. అందులో బర్గర్‌ను చూసి షాక్ అయ్యాడు.
అన్నేళ్లుగా అలానే ఫ్రెష్‌గా ఇప్పుడే చేసిన బర్గర్‌లా ఉండడంతో ఆశ్చర్యపోయాడు. బ్రెడ్, బర్గర్ పైభాగం అంతా యథావిధిగా ఉన్నా..

 

దానిలోని చికెన్ మాత్రం కప్‌బోర్డ్ స్మెల్ వస్తోందట. అయితే అంత కాలం అలానే ఉన్న బర్గర్‌ను ఇంకొన్నాళ్లు ఉంచి చూద్దామనుకున్నాడు డేవిడ్. దాన్ని ఒక బాక్స్‌లో పెట్టి లాక్ చేశాడు. ఇటీవల మళ్లీ దాన్ని చెక్ చేస్తే అలానే ఉందని అతడు చెబుతున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ  తెలిపింది.. ఈ విషయం తెలిసి అందరు ఆశ్చర్యంలో ఉన్నారు.. ఫుడ్ ప్రొడక్ట్స్ కి కూడా గారంటీ ఇవ్వవచ్చు అని అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: