చాలా మంది మ‌గ‌వారికి అస‌లు అమ్మాయిలు ఏం ఇష్ట‌ప‌డ‌తారో తెలియ‌దు. వారి మ‌నసు తెలుసుకోకుండానే ప్ర‌వ‌ర్తిస్తుంటారు కొంత‌మంది. అమ్మాయిలు చాలా విష‌యాల్లో జెన్యూన్‌గా ఉంటారు. కాక‌పోతే అందరూ ఒకేలా ఆలోచించరు.. ఒకే విధంగా ఉండరు.. అయితే పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే అమ్మా యిల్లో ఎక్కువ మంది తమని శారీరకరంగా ఇష్టపడేవారికంటే.. మానసికంగా కోరుకున్న వారికే ఇంపార్టెన్స్ ఇస్తారట. వారినే నిజంగా ప్రేమిస్తారు. కోరుకుంటారు.

 

మ‌రి కొంత‌మంది మహిళలు ఎక్కువగా తమని ఇష్టపడాలని కోరుకుంటారట. వారిపై కొంత ప్రేమ చూపిస్తే చాలు వారిని మరిచిపోరని చెబుతున్నారు పరిశోధకులు. వీలైనప్పుడల్లా వారితో హ్యాపీగా మాట్లాడుతూ కొద్దిగా ప్రేమను చూపిస్తే చాలని చెబుతున్నారు. అదేవిధంగా తమకి ఎప్పుడూ దగ్గరగా ఉంటూ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటే చాలు.. నిజానికీ శారీరక అనుబంధం అనేది మానసిక అనుబంధంతో పోల్చితే ఎంతో గొప్పదని చెబుతున్నారు. శారీరకం అనేది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. కానీ, మానసికంగా అనేది వారిని ఎప్పటికీ విడిచిపోదని చెబుతున్నారు.

 

కొంతమంది వ్యక్తులు అమ్మాయిలు చాలా క‌మ‌ర్షియ‌ల్‌గా ఆలోచిస్తారు. నిజానికి మహిళలు ఒక్కసారిగా ఇష్టపడితే వారి ప్రేమనంతా వారికే పంచాలనుకుంటారు. స్వార్థం లేని ప్రేమని చూపిస్తారని చెబుతున్నారు. వారి ప్రేమ ముందు అన్ని దిగదుడుపే అని అంటున్నారు. మెంటల్ అట్రాక్షన్‌‌తో పోల్చుకుంటే ఫిజికల్ అట్రాక్షన్‌ని అంతగా ఇష్టపడరని చెబుతున్నాయి పరిశోధనలు. ఫిజికల్ అట్రాక్షన్‌ని ఆ టైమ్‌లో మాత్రమే కోరుకుంటారని.. కానీ, ఆ తర్వాత వాటి గురించి పెద్దగా ఆలోచించరని చెబుతున్నారు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే వారికి మెంటల్లీ దగ్గర అవ్వాలని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: