హిందూ వివాహ వ్యవస్థలో మాంగల్య ధారణ ప్రధాన ఘట్టం.. వివాహ వేళ వధువు మెడలో మాంగల్యం కట్టేటప్పుడు వరుడు మూడు ముళ్లు వేస్తాడు. మనసా వాచా కర్మణా నిన్నే నా భార్యగా స్వీరిస్తున్నానన్నది ఆ మూడుముళ్ల ఆంతర్యం అని పెద్దలు చెబుతారు. అంటే మనసుతోనూ, మాటతోనూ చేతలతోనూ ఆమెను పత్నిగా చేసుకుంటున్నాని చెప్పడమన్నమాట.

 

అయితే విచిత్రమేమంటే వివాహాల్లో మనం ఎంతో ముఖ్యమైనదని భావించే ఈ మంగళసూత్రధారణ వేదాల్లో లేదు. అంతెందుకు? మనం ఎంతో వేడుకగా జరుపుకునే తలంబ్రాల గురించీ వేదం చెప్పలేదు. అలాగే నల్లపూసలు, కాలి మెట్టెలు కూడా! సుమారు పదకొండో శతాబ్దం నుంచీ ఇవన్నీ వాడుకలోకి వచ్చాయంటారు.

 

అందుకే ఆదర్శదంపతులుగా పేరుపడిన సీతారాముల కల్యాణవేళ తాళిబొట్టు తతంగం ఎక్కడా కనబడదు. వరమాలతోనే పెళ్లయిపోయింది. ఇరువైపుల పెద్దలూ వధూవరులను ఆశీర్వదించారు. సంప్రదాయాలు ఎలా ఉన్నాయన్నది కాదు. వాటి వెనుక అంతరార్థమే అసలు అర్థం. అది తెలుసుకుని మసిలితే వివాహమే స్వర్గం.. తెలియకపోతే.. అదే నరకం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: