రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన స్వామి వివేకానంద జయంతి జనవరి 12ని నేషనల్ యూత్ డే గా దేశమంతటా భక్తిశ్రద్ధలతో మనం జరుపుకుంటాం. 1893 లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మత సర్వసభ్య సమావేశంలో స్వామి వివేకానంద ప్రసంగించారు. ఈ ప్రసంగం తరువాత, అతను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు.  స్వామి వివేకానంద జీవితంలో చాలా చెప్పుకోదగ్గ సంఘటనలు జరిగాయి. వాటిల్లోని ఒకటి మేము ఈరోజు ఈ ఆర్టికల్ లో చెప్పబోతున్నాం. 

 

 

ఒకసారి ఒక విచారకరమైన వ్యక్తి స్వామి వివేకానంద ఆశ్రమానికి వచ్చాడు. ఆ వ్యక్తి మాట్లాడుతూ.. తాను చాలా కష్టపడ్డానని, కానీ విజయం సాదించలేకపోయానని అందుకే ఎంతో విచారంగా ఉన్నానని వివేకానందతో చెబుతాడు. ఇంకా మాట్లాడుతూ.. తాను బాగా చదువుకున్నానని, కష్టపడి పనిచేస్తున్నానని, అయినప్పటికీ తన జీవితం లో ఎటువంటి విజయం దక్కలేదని వివేకానంద ఎదుట బాధను వ్యక్తం చేస్తాడు ఆ వ్యక్తి. విజయం త్వరగా సాధించే ఏదైనా మార్గాన్ని సూచించండని వివేకానందాని ఆ వ్వక్తి కోరుకుంటాడు. 

 

ఈ వ్యక్తి బాధకు కారణం ఏమిటో వివేకానంద అర్థం చేసుకుంటారు. ఆ సమయంలో స్వామి వివేకానందకు ఒక పెంపుడు కుక్క ఉండేది. అప్పుడు స్వామి వివేకానంద మాట్లాడుతూ...'నా కుక్కను కొంత దూరం తీసుకెళ్లి మళ్ళీ తీసుకొని తిరిగిరా. ఆ తరువాత, మీ బాధలను అధిగమించే మార్గాన్ని నేను మీకు చూపిస్తాను', అని చెబుతారు. 

 

ఇది విని అసంతృప్తి చెందుతాడు ఆ వ్యక్తి. అయినప్పటికీ, స్వామి వివేకానంద చెప్పిన మాటలని అనుసరించి, అతను ఆ కుక్కను వెంటబెట్టుకొని నడుచుకుంటూ వెళ్తాడు. అర్ధగంట సేపు ఆ కుక్కను నడిపించిన తరువాత, ఆ వ్యక్తి తిరిగి వస్తాడు. వీళ్ళిద్దరిని చూసిన వివేకానందకు కుక్క అలసిపోయిందని, కానీ ఆ వ్యక్తి మాత్రం అలసిపోలేదని తెలుస్తుంది. మీరు అలసిపోనట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ కుక్క ఎలా అలసిపోయిందని వివేకానంద అతడిని అడుగుతారు. 

 

ఆ వ్యక్తి సమాధానమిస్తూ.. 'స్వామీజీ, నేను నేరుగా నా దారిలో నడుస్తున్నాను, కాని ఈ కుక్క వీధిలో ఉన్న కుక్కలన్నింటినీ ఉరికిస్తూ  పోరాడింది. తరువాత నా దగ్గరకు వచ్చింది. ఈ కుక్క నాకన్నా ఎక్కువ పరిగెత్తింది, ఈ కారణంగా అది అలసిపోయింది' అని చెబుతాడు. 

 

 

 

మీ బాధలను అధిగమించడానికి ఇదే మార్గం అని స్వామి వివేకానంద చెబుతూ..'మీ లక్ష్యం మీ ముందే ఉంది కానీ మీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు, మీరు ఇతరులతో పోటీ పడటం ప్రారంభించి, మీ గమ్యం నుండి దూరంగా వెళ్తున్నారు. ప్రజలందరికీ అదే వర్తిస్తుంది. ఇతరుల జీవన శైలిలో లోపాలను మేము కనుగొన్నాము, వారి విజయానికి ఆటంకంగా ఉన్నది అసూయ. మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి తప్ప తక్కువ జ్ఞానాన్ని ప్రగల్భాలు చేయడానికి ప్రయత్నించవద్దు. అలాంటి ఆలోచన వల్ల మన శక్తిని వృథా చేస్తాం. అయితే మన లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ఇతరులతో పోటీ పడే ప్రయత్నంలో మీ శక్తిని వృథా చేయకండి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటేనే మనం విజయం సాధించగలం', అని చెబుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: