చనిపోయిన వారు కేవలం సినిమాల్లోనే బతుకుతారని తెలుసు కానీ నిజ జీవితంలో బతుకి మళ్ళీ ప్రాణాలతో వస్తారు అంటే మీరు నమ్ముతారా? కానీ ప్రస్తుతం మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ఒక మహిళ చనిపోయింది కానీ మళ్ళీ తిరిగి వచ్చింది. ఇంతకీ ఏంటా కథాకమామీషు చూద్దాం..



పాకిస్థాన్లోని కరాచీకి చెందిన 55ఏళ్ల రాషీదా బిబి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. అయితే బుధవారం రోజు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఆమెను అబ్బాసీ షహీద్ హాస్పిటల్ కు తరలించారు కుటుంబ సభ్యులు. వాళ్ళు ఆమె పరిస్థితిని చెక్ చేసి ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులకు తెలిపారు. అదేవిధంగా ఆమె చనిపోయిందని చెప్పేందుకు రాతపూర్వకంగా డెత్ సర్టిఫికెట్ ను కూడా సమర్పించారు.


దాంతో ఆమె భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు వారి ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆమెకు అంత్యక్రియల కార్యక్రమంలో భాగంగా స్నానం చేయడం ప్రారంభించారు. ఆ సందర్భంలోనే రాషీదా చేతి వేళ్ళు కదలడం రషీదా యొక్క కోడలు గమనించింది. ఒక్కసారిగా షాక్ అయిన ఆమె.. 'అయ్యో, అత్తయ్య గారు బతికే ఉన్నారు' అంటూ గట్టిగా అరిచింది. దాంతో మొదటిసారిగా భయపడిపోయిన కుటుంబ సభ్యులు.. వెంటనే ఒక సమీప వైద్యుడిని పిలిపించి నాడి చెక్ చేయించగా ఆమె బతికే ఉందని తెలిసింది. దాంతో ఆగమేఘాల మీద ఆమెను హాస్పిటల్ కి తరలించగా రషీదా బతికే ఉందని చెప్పిన డాక్టర్లు ఆమెకు వైద్య చికిత్సని అందిస్తున్నారు.

 


అయితే మొదటిగా రషీదాకు వైద్యం చేసిన డాక్టర్లు.. ఆమె నిజంగానే చనిపోయిందని, అన్ని చెక్ చేసిన తరువాతనే డెత్ సర్టిఫికెట్ ఇచ్చామని చెబుతున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఇక్కడి వరకు వచ్చిందని తిట్టిపోస్తున్నారు. ఏదేమైనా ఈ వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: