సంక్రాంతి సంబరాలు ఇప్పటికే ఆరంభమయ్యాయి. సంక్రాంతి ముగ్గుల పోటీలను ఇప్పటికే చాలా ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. అలాగే చాలామంది ప్రజలు తమ స్వంత గ్రామాలకు చేరుకుంటూ పండగ వాతావరణాన్ని నెలకొలుపుతున్నారు. అలాగే పిండి వంటలు కూడా చేయడానికి రెడీ అవుతున్నారు. మకర సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి ముందు రోజు భోగి పండుగను చేసుకుంటారు. భోగి పండుగ రోజు చలిని తరిమి కొడతూ పొద్దున్నే లేచి భోగి మంటలు వేస్తారు ప్రజలు. అలాగే ఇంటి ఎదుట రంగు రంగుల ముగ్గులను పోటాపోటీగా వేస్తారు. అలాగే ఈ ముగ్గులపై రంగురంగుల పూలను, రేగుపండ్లను అలంకరించి గొబ్బెమ్మల పాటలు పాడుతారు.


కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ప్రతి చోటా కాంక్రీట్ వాకిళ్లు రావడంతో చాలామంది ఆడవారు ముగ్గులను వేయడమే మానేశారు. అసలు సంక్రాంతి పండుగ అంటే ఏంటో కూడా ఈ తరం యువతీ యువకులకు తెలియకుండా పోతుంది. చెప్పుకుంటే సిగ్గు చేటు కానీ పట్టణ ప్రాంతాల్లో గొబ్బెమ్మలు చూడటమనేది ఒక ప్రపంచం వింత లాగా అయిపోయింది. ఎక్కడ చూసినా భవనాలు తప్ప ఆహ్లాదకరమైన వాతావరణమే లేదు. తెలుగు మహిళల సాంప్రదాయం నానాటికీ కనుమరుగు అవుతూ వస్తుంది.


అసలు మన వనితామనులందరూ తమ ఇళ్ల ప్రాంగణాలలో బ్రహ్మాండమైన ముగ్గులేసి వారి కళానైపుణ్యాన్ని చూపించి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తారు. కానీ ఇప్పటి రోజుల్లో ముగ్గులు వేయడానికి ఎవ్వరు ఆసక్తిని చూపడం లేదు. మరీ ఈ కాంక్రీట్ ఫ్లోర్ లపై ముగ్గులు వచ్చిన రోజు నుండి ఆడవాళ్ళు ముగ్గులు వేయటం మర్చిపోయారు. దానితోపాటు సంక్రాంతి పండగను పూర్తిస్థాయిలో చాలా తక్కువ మంది జరుపుకుంటున్నారు. తెలుగు సంస్కృతి లో గొప్ప పండుగ మకర సంక్రాంతి గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది కానీ నేటి తరం మూవీస్ పండుగని పూర్తి స్థాయిలో జరుపుకోవడం దురదృష్టకరం. మీరు ఎంత గొప్పగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారో కింద కామెంట్ శిక్షణలు పేర్కొనండి.

మరింత సమాచారం తెలుసుకోండి: