చిన్న పాప, బాబు కనపడితే సాధారణంగా మనం ఎం చేస్తాం...?? సాధారణంగా వాళ్ళు బొద్దుగా, ముద్దుగా అందంగా ఉంటారు కాబట్టి మనకి చూడగానే ముద్దొస్తారు.. అందుకు మనం వెంటనే వారిని దగ్గరకు తీసుకుని ఆలోచించకుండా వారికీ ముద్దు పెట్టేస్తాం. మన భారతీయులకు అయితే.. ఇంకా తొందర ఎక్కువ కాబట్టి పక్కన వాళ్ళ చేతుల్లో ఉన్నా సరే ముందుకి వంగీ.. వంగీ.. మరీ ముద్దుల మీద ముద్దులు పెడతారు. ఒక్క ముద్దుతో ఆపుతారా…? బుగ్గల మీద పెదవుల మీద దొరికిందే అవకాశం అనుకుంటారో ఏమో పెట్టేస్తూ ఉంటారు.

 

కాని చిన్న పిల్లలకు ముద్దు పెట్టె ముందు ఒక విషయం తెలుసుకోండి. ఈ ముద్దు అనేది వారి ఆరోగ్యానికి, జీవితానికి ఉండే సమస్య. మీకు ముద్దు వస్తే వాళ్ళతో ఆడుకోండి గాని అలా దగ్గరికి తీసుకుని ఏకంగా ముద్దు మీద ముద్దు పెట్టేయకండి. అది వాళ్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదంట. ఈ విషయాన్ని అమెరికా వైద్యులు చెప్పారు. అమెరికాలోని పిల్లల వైద్య నిపుణులు కరిన్‌ నీల్సన్‌ పరిశోధనలు చేసి ఈ విషయంలో ఒక వార్నింగ్ ఇచ్చారు. పెదవుల పై చిన్నచిన్న పుండ్లు రావడానికి కాణమయ్యే హెచ్‌ఎస్వీ- 1 అట. 

 

ఇటు వంటి వైరస్ లు మీరు పెట్టె ముద్దు ద్వారా పెద్దల నుంచి పిల్లలకు చేరుతాయని ఆందోళనకర విషయం చెప్పారు అమెరికా డాక్టర్లు. . దీనివల్ల చిన్నారులకు దద్దుర్లు, పుండ్లు, జ్వరం వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. అవి వచ్చినప్పుడు వెంటనే చికిత్స అందకపోతే, శిశువు చూపు కోల్పోవడం అది ఒక్కటే  కాకుండా కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బ తినే అవకాశాలు మెండుగా ఉన్నాయని అమెరికా డాక్టరు హెచ్చరించారు. కాబట్టి వారిని చూడగానే ముద్దు వస్తే.. వారికీ ముద్దు పెట్టకుండా వారితో కాసేపు ఆడుకుని ఆ సరదని తీర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: