సంక్రాంతి మన భారత దేశంలో అత్యంత శ్రద్దగా, నిష్ఠగా జరుపుకుంటారు. సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తాం.. అందుకే దీనిని గాలిపటాల పండుగ అని కూడా అంటారు.ఈ పండుగ రోజుల్లో  కొత్త అల్లుళ్ళ తోను, బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి. ఈ పండుగ కేవలం మన దేశంలోనే కాక మన పొరుగు దేశాలైనటువంటి భర్మ, నేపాల్, థాయిలాండ్ దేశాల్లో కూడా జరుపుకుంటారు. 


పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, గొబ్బమలతో స్వాగతం పలుకుతాయి. వేకువ జామున హరినామ సంకిర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మల్లిస్తాడు. గంగిరెద్దులు, కోడి పందాలు, ఎడ్ల పందాల మాట సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది. ఇంటిల్లపాది మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్ళల్లో వాలిపోతారు. 


సంక్రాంతి రోజున వేకువజామున నిద్రలేసి తలంటు స్థానం చేసి తెలుగింటి ఆడపడుచులు వాకిట్లో సింగారంతో ముగ్గులు పెడుతుంటే..పెద్దవారు ఇంటికి తోరణాలను అలంకరిస్తారు.సేమ్య పాయసం,గారెలు,బూరెలు మొదలైన పిండి వంటలు ఆరగించి పనివారికి ,రజకులకు ఇంకా ఇంటి పక్కవారికి తాము వండుకున్న పిండివంటల రుచి చూపిస్తారు.కొత్త అల్లుళ్ళకు ఈ పండుగ మరీ ప్రత్యేకం .ఎక్కడున్నా సరే భార్యతో అత్తారింటికి వెళ్ళడం ఆనవాయితీ. పితృ దేవతలకు ఈ రోజున పితృ తరపనాలు సమర్పిస్తారు.


ఈ రోజు పశువులకు పూజ చేస్తారు.గంగిరెద్దు మేలంవారు గంగిరెద్దులను చక్కగా అలంకరించి ప్రతి ఇంటికి వెళ్లి అయ్యవారికి దండం పెట్టు..అమ్మ వారికీ దందం పెట్టు అంటూ..సన్నాయి వాయిద్యం వా యి స్తూ..గంగిరేద్దులచే లయబద్ధంగా నృత్యం చేపిస్తూ ఆ ఇంటివారు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు.కనుమ పండుగ రోజు తరువాత వచ్చేది ముక్కనుమ మాంసాహారం ,మినుప గారెలు వండుకుంటారు.ముక్యంగా ఈ ముచ్చటైన మూడురోజుల పండుగకు తెలుగు లోగిళ్ళు కలకలలాడుతాయి

మరింత సమాచారం తెలుసుకోండి: