ఈరోజుల్లో చాలామంది తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు చేసి వ్యాపారంలో విజయం సాధించాలని ఆశిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఖర్చులు పెరిగిపోతూ ఉంటే ఆదాయం మాత్రం తగ్గుతూ వస్తోంది. తక్కువ పెట్టుబడితో 1000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు సంపాదించే వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఈ వ్యాపారాలు చేయడం ద్వారా రోజూవారీ ఆదాయం పెంచుకోవటంతో పాటు వ్యాపారాల ద్వారా తక్కువ సమయంలో విజయాలను పొందవచ్చు. 
 
తక్కువ పెట్టుబడితో ఫాస్ట్ ఫుడ్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే రోజుకు 1000 రూపాయల నుండి 5000 రూపాయలు సంపాదించవచ్చు. నాణ్యత పాటిస్తే ఆదాయంతో పాటు భారీగా లాభాలు సొంతం అవుతాయి. తక్కువ పెట్టుబడితో మంచి సెంటర్ లో టీ స్టాల్ బిజినెస్ ఓపెన్ చేసి ఒక వర్కర్ ను నియమించుకొని మేనేజ్ చేయగలిగితే చాలు రోజుకు 1000 రూపాయల నుండి 3000 రూపాయల వరకు సంపాదించవచ్చు. 
 
తక్కువ పెట్టుబడితో భారీగా ఆదాయం సంపాదించే వ్యాపారాల్లో కర్రీ పాయింట్ ఒకటి. క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కూరలు రుచికరంగా ఉంచితే చాలు ఈ బిజినెస్ ద్వారా నెలకు లక్షల్లో సంపాదించవచ్చు. ఇంట్లో ఉండి వ్యాపారం చేయాలనుకునేవారు పేపర్ ప్లేట్స్ ద్వారా ఆదాయం సంపాదించవచ్చు. ముడిసరుకును అందించి పేపర్ ప్లేట్స్ తీసుకునే సంస్థతో అగ్రిమెంట్ చేసుకొని పేపర్ ప్లేట్స్ బిజినెస్ ద్వారా సులువుగా నెలకు 30,000 రూపాయలకు పైగా సంపాదించవచ్చు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: