వివాహ బంధం అంటే మూడు ముళ్ల బంధం.. తాళిబొట్టుతో కూడిన దారాన్ని వరుడు వధువు మెడలో మూడు ముళ్లు వేస్తేనే కళ్యాణ బంధం పడుతుంది. మరి అసలు ఈ తాళి బొట్టు సంప్రదాయం ఎలా వచ్చిందో తెలుసా.. ఈ తాళిబొట్టుకు సంబంధించిన వివరాలు మన పురాణాల్లోని స్కాంధ పురాణాల్లో ఉన్నాయట.

 

అసలు మనం ఇప్పుడు ఉచ్చరిస్తున్న తాళి అనే పదం తాళపత్రం నుంచి వచ్చిందట. తాళి అంటే తాటాకు అని అర్థం. పూర్వం తాటాకును మడిచి దానికి పసుపు కుంకుమలు బొట్లుగా పెట్టి వధువు మెడలో కట్టేవారట. అదే తాళిబొట్టు. కాల క్రమంగా ఈ తాటాకు స్థానంలో బంగారంతో తయారైన పుస్తెలు వచ్చి చేరాయి.

 

రెండు పుస్తెలలో పుట్టింటి వారొకటీ మెట్టింటి వారొకటీ చేయించడం సంప్రదాయం. ఇవి లక్ష్మీ పార్వతులకు ప్రతిరూపాలు. ఇదీ తాళి బొట్టు మహత్యం, ప్రాశస్త్యం. ఈ సూత్ర ధారణకు ముందు వరుడు వధువుకు యోక్త్ర బంధనం చేస్తాడు. ఇదీ ఈ తాళిబొట్టు ప్రత్యేకత అర్థమవుతుందా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: