ఓ వ్యక్తి తాను ప్రేమిస్తున్న అమ్మాయికి తన లవ్ ప్రపోజ్ చేయడానికి తెగ మధన పడుతూ ఉంటాడు. ఆ సమయంలో అతడికి ఉండే టెన్షన్ , గుండె కొట్టుకునే వేగం , చెప్పిన తరువాత ఆ అమ్మాయి ఎలా రెస్పాండ్ అవుతుందోననే బెంగ అన్నీ ఆ ప్రేమికుడిని అతలాకుతలం చేస్తాయి. మరి కొంతమంది బహిరంగ వేదికలపై ప్రేమని వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇంకొంతమంది నేరుగా ఇంటికి వెళ్ళిపోయి ఆమె తల్లి తండ్రులతో చెప్పేస్తారు. కానీ అమెరికాలోని ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమని వ్యక్త పరచడానికి ఏమి చేశాడో చూస్తే షాక్ అవుతారు. వివరాలలోకి వెళ్తే..

Image result for sleeping <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BEAUTY' target='_blank' title='beauty-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>beauty</a> proposal

లాస్ ఏంజిల్స్ కి చెందిన ఫిలిం మేకర్, ఎడిటర్ అయిన లీలోచ్లర్. సుత్తి అనే భారత సంతతి మహిళని ప్రేమిస్తున్నాడు. ఆమె అక్కడ గుండె సంభందిత వైద్యురాలిగా పనిచేస్తోంది. అయితే అందరిలా కాకుండా కొంచం డిఫరెంట్ గా తన ప్రేయసికి తన ప్రేమని తెలుపాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన ఫిల్మ్ మేకింగ్ కి పదును పెట్టాడు..

https://www.instagram.com/tv/B7GpxgqJROo/

 

సినిమాకి వెళ్దాం అంటూ ఆమెని సినిమా హాలుకి తీసుకు వెళ్ళాడు. ముందుగానే ఆ హాలులో తన స్నేహితులు , కుటుంభ సభ్యులని ఆమెకి తెలియకుండా ప్రేక్షకులుగా ఉంచాడు. సినిమా తెరపై వచ్చింది. యానిమేషన్ మూవీ లా ఉందని ఆమె అనుకునే లోగానే సినిమాలో పడుకున్న ఓ రాజ యువతి ముఖం అచ్చం ఆమె లా ఉండటం చూసి షాక్ అయ్యింది. ఇక హీరో వంతు వచ్చే సరికి అచ్చం ఆమె ప్రియుడి ముఖం లా ఉంది. దాంతో ఒక్క సారిగా షాక్ నుంచీ తేరుకుని ప్రియుడి వైపు చూసేలోగానే అతడు రింగ్ తీసుకుని ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. హాలులో అంతా చప్పట్లు, ఆమె సంతోషానికి అవధులు లేవు. చివరికి ఆమె అతడి ప్రేమని ఒప్పుకుంది. పెళ్లికి సిద్దమని చెప్పింది. ఇప్పుడు ఈ సరికొత్త లవ్ ప్రపోజల్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: