హిందూ వివాహ వేడుక అంటే ఓ జీవిత కాల సంబరం. వేరే ఏ పెళ్లిళ్లలోనూ ఇంత సందడి, సంబరం కనిపించవు. చూసేందుకు కలర్ ఫుల్ గా ఉన్నా.. ఇందులో ప్రతి తంతు వెనకాలా ఎంతో ప్రాధాన్యం, అర్థం, పరమార్థం ఉన్నాయి.

 

హిందూ వివాహంలో మాంగల్య ధారణ చేయడం, తలంబ్రాలు, సన్నికల్లు తొక్కడం, పాణిగ్రహణం చేయడం ఇలా ఎన్నెన్నో మరువరాని ఘటనలు ఉంటాయి. పెళ్లి తర్వాత.. వధూవరులతో కొన్ని ఆటలు ఆడిస్తారు. బిందెలో వేసిన ఉంగరాలను తీయిస్తారు. పూలచెండుతో ఆడిస్తారు.

 

ఇదంతా తమాషా కోసం కాదు. వధూవరుల మధ్య సాన్నిహిత్యం పెంచడం, పరస్పరం ఆకర్షణను పెంచడానికి ఈ ఆటలు ఆడిస్తారు. వివాహం తర్వాత ఒకేసారి శారీరక కలయిక ద్వారా ఇబ్బంది పడకుండా.. ఒకరికొరిని పరిచయం చేసేందుకు, సాన్నిహిత్యం చేసేందుకు ఈ ఆటలు ఆడిస్తారు.

 

ఇలా పెళ్లిలో జరిగే ప్రతి తంతూ అటు సంప్రదాయాలను ఇటు లౌకిక ధోరణులనూ దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినవే అనుకోవాలి. మన పెద్దల ముందుచూపునకు జేజేలు పలకాల్సిందే. మీరేమంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి: