సంక్రాంతి తరువాత మరుసటి రోజు వచ్చే కనుమ పండగని తెలుగు వారు బాగా జరుపుకుంటారు. అయితే, ఈ రోజున గోమాత లకు, ఇంకా ఇతర జంతువులకు ప్రజలు సేవలు చేస్తుంటారు. దేవతలందరు కూడా గోమాతలో ఉంటారు కాబట్టి 12 రాశుల వారు తమ నవగ్రహ దోషాలను తొలగించుకునేందుకు గోమాతకు పదార్దాలను తినిపించినట్లైతే ఫలితం ఉంటుంది. అలాగే, కాలభైరవుడు అనగా ఎంతో విశ్వాసం గల జంతువైన శునకముకు కూడా కనుమ రోజు కొన్ని పదార్థాలను తినిపిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అయితే ఆ కొన్ని పదార్థాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


కనుమ పండుగ రోజు ఉదయం గాని సాయంత్రం గాని... గోధుమపిండి, బెల్లం, ఓ చెంచా పాలతో 5 గాని, 7 గాని, 11 గానీ రొట్టెలను నెయ్యితో కాల్చి తయారుచేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే, ఈ రొట్టెలను మగవారు కానీ ఆడవారు కానీ ఇద్దరిలో ఎవరైనా చేయొచ్చు. నవగ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నవారు ఆడవారు అయితే రొట్టెలను కాల్చేటప్పుడు ఎడమచేతిని ఎక్కువగా వాడాలి.. మగవారు అయితే కుడిచేతిని ఎక్కువగా వాడాలి. రొట్టెలను తయారు చేసిన తర్వాత... గోమాత చుట్టూ ప్రదక్షణలు చేసి ఆ తర్వాత గోమాత యొక్క కుడికాలు వద్ద ఉన్న దూలిని తీసుకుని నుదుటన బొట్టు పెట్టుకోవాలి. తరువాత తయారు చేసినటువంటి రొట్టెలను గోమాతకు తినిపించాలి. ఇలా గోమాతకు సేవలు చేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది.


ఇకపోతే కాలభైరవుడైన శునకముకు ఎలా తినిపించాలంటే.. మీరు 7, 11 లేదా 19 రొట్టెలను తయారు చేసుకోవాలి. అయితే వీటిని గోధుమపిండి, లైట్ గా బెల్లం, కొన్ని తేనె చుక్కలు, కొంచెం పాలు లతో తయారు చేయాలి. ఈ రొట్టెలను కాల్చేటప్పుడు మీరు ఆవాల నూనె ను వాడటం మంచిది. కాలసర్ప దోషం, పంచమ రాహు, అష్టమ రాహు, రాహు కేతువుల పీడలు తొలగించుకోవడానికి ఆవాల నూనె ను వాడటం మంచిది. అయితే ఈ తయారు చేసినటువంటి రొట్టెలను శునకాలకి ఎలా సమర్పించాలి అంటే.. మొదటిగా మీ వీధి లో ఉన్నటువంటి శునకాల వద్దకు వెళ్ళాలి. ఒకవేళ మీరు శునకాన్ని పెంచినా.. వాటికి మాత్రం మీరు ఈ రొట్టెలను తినిపించ కూడదు. కేవలం వీధిలో ఉంటున్న శునకాలకి మాత్రమే రొట్టాలను తినిపించాలి. రొట్టెల తినిపించేటప్పుడు మొదటిగా.. మీ కుడి చేతితో రొట్టె ముక్కలు చేసి ఎడమచేత్తో శునకాల కి అందించాలి. శునకాలు రొట్టెలను తిన్న తర్వాత... మీ ఇంటికి వెళ్లి మట్టి కుందిలలో దీపారాధన చేసి మీ మనసులోని కోరికను కోరుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా దోషాలు ఉంటే అది తొలగిపోవాలని దీపారాధన ముందు మీరు కోరుకునవలెను. 

మరింత సమాచారం తెలుసుకోండి: