తెలుగు ప్రజలందరూ పెద్ద పండుగగా జరుపుకునేటటువంటి మకర సంక్రాంతి పండుగలో మూడవరోజు వచ్చేది కనుమ. మకర సంక్రాంతి పండుగ వస్తుందంటే 2 వారాల ముందు నుంచే హుడావుడి ఉంటుంది. సంక్రాంతి అంటేనే ప్రకృతితో జరుపుకునే పండగ అని పెద్దలు చెబుతుంటారు. మనకు సహాయపడుతున్న సమస్త జీవులకు కనుమ రోజు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సేవలు చేస్తూ ఉంటాం. 

 

 

అలాగే కనుమ రోజు వచ్చే ముందు రాత్రి ఇళ్లలో చాలా ఉత్సాహంగా సమయం గడుపుతుంటారు ప్రజలు. ఆ సమయంలోనే ప్రత్యేకంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు గోరింటాకు పెట్టుకుంటారు. కనుమ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంటి పనులు ప్రారంభిస్తారు ఆడపడుచులు. ఈ పండుగలో భోగి మంటలు గొబ్బెమ్మలు, గోరింటాకు, పిండి వంటలు అన్ని ప్రజలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా మారుస్తాయి. 

 

కనుమ రోజు ప్రత్యేకమైన వంటలు చేస్తుంటారు ప్రజలు.ఆ ప్రత్యేకమైన వంటలు ఎంటో ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం. కనుమ రోజున పశువుల కొట్టంలో పొంగలి వండి దానికి కుంకుమ కలిపి వారి పొలాల్లో చల్లుతారు. చీడపీడలు తమ పొలాలకు పట్టకుండా రక్షించాలని దేవా దేవుళ్ళను కోరుకుంటారు రైతులు. తర్వాత గారెలను వండుకొని ప్రజలు ఆరగిస్తారు. 

 

అదేవిధంగా కనుమ రోజున మాంసాహారులకు ప్రియమైన రోజుగా పరిగణిస్తారు. ఎందుకంటే భోగి సంక్రాంతి రెండు రోజుల్లో ప్రజలు మాంసాహారాన్ని ముట్టరు. కానీ కనుమ రోజు మాంసాహారాన్ని వండుకొని తింటారు. కనుమ రోజు తర్వాత ప్రజలు జరుపుకునేది ముక్కనుమ పండుగ. అయితే ఈ ముక్కల కనుమ పండుగ సందర్భంగా గ్రామదేవతలకు బలి ఇచ్చే మాంసాహారాన్ని జరుపుకునే ఆచారం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకోగా... తమిళనాడు రాష్ట్రంలో నాలుగు రోజులు జరుపుకుంటారు. ప్రస్తుత ప్రజల హడావుడిని చూస్తుంటే ఈ సారి మకర సంక్రాంతిని బాగా జరుపుకుంటున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: