నేటి పురుషాధిక్య సమాజంలో భార్య అంటే చాలా మంది భర్తలకు చులకన. అందులోనూ ఆమె గృహిణి అయితే ఆ చులకన స్థాయి మరింత పెరుగుతుంది. ఏం చేస్తున్నావ్.. ఇంట్లో తిని కూర్చోవడమే కదా.. అంటూ ఈసడిస్తారు. మీలో చాలా మంది ఇలా చేసి ఉండొచ్చు. అయితే బార్య స్థానం గురించి మన పెద్దలు చాలా గొప్పగా చెప్పారు.


అసలు పెళ్లిలో పాణి గ్రహణం వేళ వరుడు పలికే మంత్రాల సారాంశం ఏంటో తెలుసా.. ? నీ మనసు నా మనసుతో- నీ ఆలోచన నా ఆలోచనతో- ఉండాలి. హృదయపూర్వకంగా నన్ను అనుసరించాలి. జీవితాంతం నా సహచరివై తోడుగా ఉండాలి. నా ఇంటి శాసనాధికారిగా నా చేయి పట్టుకుని నువ్వు రావాలి.

 

అంటే వధువు.. వరుడి ఇంటికి శాసనాధికారి. అందుకే కోడల్ని అత్తింటికి రాణి అంటారట. జీవితాంతం మెట్టినింటిలో ఉండి ఆ ఇంటికి వారసుల్ని ఇచ్చే ఆమె రాణి కావడంలో తప్పేముంది. మహారాణి అన్నా లోటేముంది? ఏమంటారు. ఇంట్లో భార్యాభర్తలు మహారాణిలా ఆమె మహారాజులా అతను పరస్పరం ప్రేమానురాగాలతో ఉంటారు.. ఉండాలి కూడా! అంతే తప్ప.. భర్త యజమానిలా, భార్య బానిస అన్నబూజు ఆలోచనలు ఏమాత్రం మంచివి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: