చదువు.. చిన్నప్పటి నుండి మన తల్లిదండ్రులు చదవమని రాచిరంపన పెడతారు. చదువు అంటే చాలు మనకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అంత సతాయిస్తారు మన తల్లితండ్రులు చదువు చదువు అని.. ఒక్క తల్లితండ్రులే కాదు బడికి వెళ్తే గురువులు కూడా అంతే..  పాస్ మార్కులు వచ్చాయి అంటే నువ్వు ఎవరో కూడా తెలీదు.. ఒకవేళ ఫెయిల్ మార్కులు వచ్చాయి అంటే చుక్కలే. 

 

ఈ సంఘటనలు 90 శాతం విద్యార్థుల జీవితంలో జరిగేవి. కేవలం 10 శాతం విద్యార్థులు మాత్రమే చదువు అంటే ఇష్టంగా చదువుతారు. వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అలా అని మిగితావారి జీవితాలు బాగా ఉండవు అని కాదు.. ఎందుకు అంటే చదువులో ముందు ఉన్న లేకున్నా తెలివి బట్టి జీవితాన్ని ఏలుతారు. 

 

అయితే జీవితంలో ఉన్నత శిఖరాల్ని తాకేవారు మాత్రం చదువుకున్న వారే.. అందుకే చదువుపై ప్రేమ అనేది ఉండాలి అప్పుడే చదువులో ఆనందాన్ని పొందగలుగుతాం.. ఎథినా తెలుసుకోవాలి అని ఉత్సాహం ఉండాలి.. అప్పుడే ఉన్నత శిఖరాలను తాకగల్గుతాం.. తల్లితండ్రులు తిట్టరానో.. గురువు కొట్టాడనో చదువుపై కోపం పెంచుకోకుండా చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: