ఆంధ్రా కశ్మీర్ లంబసింగి పర్యాటకులను నిరుత్సాహ పరుస్తోంది. సంక్రాంతి సీజన్ లో జీరో డీగ్రీల వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చేవారికి నిరాశ మిగులుతోంది. వాతావరణంలో మార్పులు కారణంగా ఈ  ఏడాది పది డిగ్రీలకు తక్కువ ఉష్ణోగ్రతలు ఇక్కడ రికార్డవ్వలేదు. అయితే తెరలు తెరలుగా కమ్ముకునే హిమశోయగాన్ని చూసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు టూరిస్ట్ లు.

 

దట్టమైన పొగమంచు..హిమ తుంపరులు...అతిచల్లని గాలులు...వలస పూల సొగసులు... ఆకుపచ్చని హరితారణ్యం అందాలు.... ఇలా అంతా ప్రకృతి సోయగాలతో నిండి ఉండే అతిశీతల ప్రాంతాన్ని చూడాలనుకునే టూరిస్టులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్‌లోని  లంబసింగి. 

 

దక్షిణభారతదేశంలో పర్యాటకులను అధికంగా ఆకట్టుకుంటున్న ప్రాంతాల జాబితాలో చేరిపోయింది లంబసింగి. విశాఖ ఏజెన్సీలోని తూర్పుకనుమల్లో వుండే ఇక్కడి కొండల్లో  అతిశీతల వాతావరణం వుంటుంది. ఆంధ్రా కాశ్మీర్ గా...ప్రత్యేక గుర్తింపు పొందింది. లంబసింగి ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 3,600 అడుగుల ఎత్తులో ఉంటుంది. వీటికి తొడుగా లంబసింగి చుట్టూ కూడా అత్యంత ఎత్తైన కొండలు,కోనలు..వీటి చూట్టూ సెలయేళ్లు...వాటికి ఆనుకుని పచ్చని ప్రకృతి పరుచుకుని ఉంటుంది. 

 

లంబసింగికి వెళుతున్న మార్గంలో మలుపు మలుపులో తిప్పుకోలేనంత అందం కనిపిస్తుంది. ఇక్కడి లోయలు కశ్మీరాన్ని తలపిస్తాయంటే అతిశయోక్తి కాదు. చింతపల్లి, లంబసింగి ప్రాంతాల్లో ఏటా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సంక్రాంతి సమయంలో చలి ఎముకలను కొరికేస్తోంది. స్థానిక గిరిజనులు చలి మంటలతో స్వాంతన పొందుతుండగా.. దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు క్యాంప్ ఫైర్ లతో  ఆస్వాదిస్తుంటారు.  శీతాకాలంలో లంబసింగిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలపై కొన్నేళ్ళుగా జరుగుతున్న ప్రచారం పర్యాటకుల తాకిడిని బాగా పెంచేసింది. గత కొన్నేళ్ళుగా డిశంబర్-జనవరి మధ్య కాలంలో ఇక్కడ జీరో డిగ్రీలు నమోదవుతాయనేది ఓ అంచనా. లంబసింగికి అత్యంత సమీపంలోనే తాజంగి జలాశయం చూపురులను అహ్లాదపరుస్తుంటాయి. అత్యంత ఎత్తైన కొండ ప్రాంతాన్ని అనుకుని ఈ జలాశయం ఉంటుంది. జలాశయం చుట్టూ పచ్చని ప్రకృతి పరుచుకుని ఉంటుంది. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించి, మధురానుభూతి పొందేందుకు పర్యాటకులు ఇష్టపడుతుంటారు. అంతేకాదు దీనికి పక్కనే పిల్లలవేనం అనే ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలోనే అత్యంత దట్టమైన మంచు మేఘాలను కమ్మేస్తుంటుంది. భూతలాన్ని, ఆకాశాన్ని కూడా మంచు మేఘాలు దుప్పట్లా పరుచుకుని ఉండటంతో పర్యాటకులు ఈ దృశ్యాలను చూసి మంత్రముగ్ధులవుతుంటారు. సాయంత్రం ఆరు గంటలైతే చాలు బస చేయాలనుకున్న పర్యాటకులు క్యాంప్ ఫైర్ వేస్తుంటారు. 

 

అయితే ఈ సారి జీరో డిగ్రీల వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు లంబసింగికి వచ్చిన పర్యాటకులు కాస్త నిరాశకు గురయ్యారు. సీజన్ ప్రారంభం నుంచి 10నుంచి17డిగ్రీల మధ్య టెంపరేచర్ వస్తోంది.దాంతో టూరిస్టుల తాకిడి తగ్గకపోయినా,  ఆ మజా కోసం ఆతృత పడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: