సంక్రాంతి సందడికి ముఖద్వారం భోగి.. భోగి మంటలతోనే సంక్రాంతి సందడి ప్రారంభమవుతుంది. పాత వస్తువులను భోగి మంటల్లో వేసి.. కొత్తకు స్వాగతం పలకడం భోగి మంటల విశిష్టత. అయితే ఇది రొటీన్.. మరి మీ భోగి మంటలు మరింత స్పెషల్ గా ఉండాలంటే ఏం చేయాలి.. ?

 

సాధారణంగా కట్టెల వంటి వస్తువులతో భోగి మంటలు వేస్తే మంట ఎర్రగా , పసుపు పచ్చగా వస్తుంది. అయితే.. ఈ మంటలో మేజిక్ ఫైర్ పౌడర్ వేశామంటే.. అప్పుడు మంటలు కేవలం ఎరుపు, పసుపు రంగుల్లోనే కాదు.. సప్తవర్ణాలతో మంటలు ఆకట్టుకుంటాయి.

 

ఈ వింత చూసేవారిని ఆశ్చర్యచకితులను చేస్తుంది. మేజిక్ ఫైర్ పౌడరుని తెచ్చి భోగి మంటలో వేస్తే హరివిల్లు రంగుల్లో మండుతుంది. ఆ సప్తవర్ణాల వెలుగులు చిరు చీకట్లను తరిమేస్తూ ఉంటే చూసేందుకు భలేగా ఉంటుంది.

 

అసలే రంగు రంగుల ముగ్గులతో కనువిందు చేసే లోగిళ్లుకు ఇక ఇలాంటి సప్త వర్ణాల అగ్నికీలలుతోడైతే మరింత సందడిగా ఉంటుంది. మరి మీరూ ఓ సారి ట్రై చేస్తారా..? ఇలా చేస్తే.. ఈ మంటలతో ఓ సెల్ఫీ దిగేసి.. వాట్సప్ లోనో, ఫేస్ బుక్ లోనే పెట్టాలంటే ఇక లైకులే లైకులు, షేర్లే షేర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: