భోగిరోజు భోగి మంటలు ఎంత ఫేమస్సో.. భోగి పళ్లు కూడా అంతే ఫేమస్. భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగిపళ్లు పోయడం ఆనవాయితీ గా వస్తోంది తెలుగు లోగిళ్లలో. మరి ఇలా పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు.. భోగి పళ్లు పోయకపోతే ఏమవుతుంది. అసలు భోగి పళ్లు కోసం ఏమేం పళ్లు వాడతారు.. తెలుసుకుందామా..

 

భోగిరోజు పెద్దలు పిల్లలకు రేగుపళ్లూ, చెరుకు ముక్కలూ, నాణేలూ, పూలూ, నవధాన్యాలతోకూడిన భోగి పళ్లు పోస్తూఆశీర్వదిస్తారు. వీటిని ఇలా పోయడం వల్ల పిల్లలకు దిష్టి తొలగుతుందని ఓ నమ్మకం. తొలగి పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారనీ, ఆనందమయ జీవితం గడుపుతారనీ నమ్ముతారు.

 

భోగి పళ్లు పోయకపోతే ఆరోగ్యంగా ఉండని కాదు కానీ.. తరతరాలుగా వస్తున్న ఆచారం.. అంతే కాదు.. ఈ పేరుతో పిల్లలంతా ఓ చోట చేరతారు కూడా. భోగి రోజున తెలవారక ముందేఇంటిల్లిపాదీ మేల్కొని భోగి మంటలు వేసే సంగతి తెలిసిందే. ఆ మంటల చుట్టూ చేరి చలికాచుకుంటూ ఇంట్లోని పాత వస్తువుల్ని, దుస్తుల్ని వాటిలో వేస్తుంటారు. మనసులోని పనికిరాని ఆలోచనలూ, దురలవాట్లను దూరం చేసి కొత్త జీవితం మొదలు పెట్టడానికి ప్రతీకగా ఇలా ఇంట్లోని పాతవాటిని మంటల్లో వేయడం ఆనవాయితీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: