కల.. మన కలలు నెరవేర్చుకునే దానికంటే కూడా ఈ కలల ప్రపంచంలోనే ఎక్కువ ఉంటాం. ఎందుకంటే మనకు నిద్ర ఎక్కువ కాబట్టి.. మనము కలలు ఎక్కువ కంటము. అయితే ఈ కలలో కొన్ని కొన్ని సార్లు మంచి కలలు వస్తాయి... కొన్ని సార్లు చెడ్డ కలలు వస్తాయి. అయితే అలా వచ్చిన కలలు చెడ్డవి ఏంటో ? మంచివి ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

మనం ఆకాశంలో ఎగురుతున్నట్టు కల వస్తే ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఉన్నామని, లేదా జీవితంలో ఎంతో ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారని అర్థం అంట.

 

ఎత్తు నుండి పడిపోతున్నట్టు కల వస్తే, ఏ విషయం మీదో పట్టు సాధించాలనే ప్రయత్నానికి సూచన అంట.

 

ఎవరో తరుముతున్నట్టు కల వస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలు, లేదా సమస్యల గురించి భయపడుతూ ఉంటే ఇలాంటి కలలొస్తాయి. 

 

ఇక ఇది డేంజర్ కల.. చనిపోయినట్టు కల వస్తే మనం నిజంగానే చనిపోతామని అర్థం కాదు. మన జీవితంలో ఒక అంకం లేదా ఒక బంధం ముగిసిపోతున్నందుకు ఈ కల సూచన అంట.

 

రగిలే మంటలు కలలోకొస్తే ఏదో మార్పు జరగబోతోందని అర్థం అంట.

 

గర్భం దాల్చినట్టు కల వస్తే గొప్ప ఎదుగుదలకు, మార్పునకు సూచన అంట.

 

డబ్బు మన మనస్తత్వంలోని లోపాలకు ప్రతిబింబాలే డబ్బులు.

 

ఇంకా చివరి కల.. పాము కలలోకి వస్తే ఏం అవుతుందో తెలుసా ? గర్భిణీల కలలోకి వస్తే ఏం అవుతుంది ? ఏం అవ్వదు.. పాము మన కలలోకి వస్తే ఎంతో మంచిదని, సృజనాత్మక శక్తి అధికంగా గలవారికే కలల్లో పాములు కన్పిస్తాయి. అంతే తప్ప పాములు మన కలలో కనిపించిన ఏమి కాదు అని.. అది డేంజర్ కాదు అని జోతిష్యులు చెప్తున్నారు. అందుకే పాము కనిపిస్తే ఎం బయపడకండి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: