సంక్రాంతి సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజే భోగి మంటలతో సంక్రాంతి సందడికి జనం తెర తీసేశారు. ఊరూరా భోగి మంటలు వేసుకుని.. చలిలో సంక్రాంతికి స్వాగతం పలికేశారు. దేశంలో ఎక్కడున్నా.. ప్రపంచంలో ఎక్కడున్నా ఈ పండుగకు పల్లెటూళ్లుకు చేరుకున్నారు చాలా మంది.

 

పండగ కోసం ముందే ప్రయాణాలు బుక్ చేసుకోవడంతో చాలా మంది భోగి నాటికి సొంత గ్రామాలకు చేరిపోయారు. ఇంకొందరు భోగి రోజు కూడా ప్రయాణాలతో కుస్తీ పడుతున్నారు. మొత్తానికి సంక్రాంతి శోభతో పల్లెలు కళకళలాడుతున్నాయి. ఏపీ, తెలంగాణ‌లోని ప్రతి ప‌ల్లె సంక్రాంతి శోభ‌ను పంచుకుంది.

 

ప్రతి ఇంట్లోనూ సంక్రాంతిని జ‌రుపుకొనేందుకు అంద‌రూ రెడీ అయ్యారు. ఇళ్లను సుంద‌రంగా తీర్చిదిద్దుకున్నారు. ఇక ఇళ్లలో గృహిణిలకు చేతి నిండా పని.. ఇంటి అలంకరణ, పిల్లలను రెడీ చేసుకోవడం, పిండి వంటలు, పండుగ స్పెషల్ వంటకాలు.. అబ్బో ఇలా ప్రతి ఇంట్లోనూ ఆడాళ్లు ఫుల్ బిజీ అయ్యారు.

 

ఇక మగరాయుళ్లు పండుగ సంబరాల కోసం సిద్ధమవుతున్నారు. కోడిపందేలు, గుండాట వంటి వినోద కార్యక్రమాలు, పశువుల పండుగలు బండలాగుడు పోటీలు ఇలా వీరి కోసం అలరించే కార్యక్రమాలు ఎన్నో, ఇంకొందరు పండుగ ఆనందాన్ని సినిమాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.మొత్తానికి ఏపీ, తెలంగాణలో సంక్రాంతి శోభ వచ్చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: