సంక్రాంతి పండుగ అంటే కొత్త ధాన్యం, కొత్త వ్యాపారాలు చేతికొచ్చిన సందర్బంగా ఊరు వాడ జరుపునే ఒక అద్భుత దినం. అందుకే ఈ సంక్రాంతి నాడు పిండి వంటలను, కొత్త బట్టలను దానికి సంకేతంగా వాడతారని అని అందరు అంటారు. అందుకే పల్లెల్లో ఈ పండుగ వాతావరణం మాములుగా ఉండదన్న సంగతి తెలిసిందే.. 

 

ఏడాది పాటు కష్టపడ్డా పాడి  పశువులకు, పాడి పంటలకు మరొక సంవత్సరం వరకు అంతా మంచే జరగాలి అంటూ ప్రజలు తమ బిడ్డలతో సమానంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఎక్కడెక్కడో ఉన్న వారంతా తమ స్వంత ఊరికి వెళ్లి ఈ పండుగను సంబరాలు చేసుకుంటారు. అందుకే బందు జనంతో ఈ పండుగ కళకళ లాడుతుంది. 

 

ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉందనుకోండి. ప్రతి ఒక్కరు ఈ పండుగలకు చేతికందిన ధాన్యాన్ని దేవుడికి నైవేద్యంగా చేసి, ఆ పంటతో పది మందికి దానం చేస్తారు. అలా చేస్తే వారు గతంలో చేసిన ఎటువంటి పాపలు అయిన సరే పూర్తిగా పోతాయని ప్రజల నమ్మకం. అందుకే అందరి వచ్చిన వారికి కాదనకుండా కడుపునిండా పెట్టి పంపిస్తారు. 

 

కానీ... ఇక్కడ మాత్రం కాస్త వ్యతిరేకమని చెప్పాలి ..సంక్రాంతి పండుగ రోజుల్లో మ‌త్స్య‌కారుల సంప్ర‌దాయం చాలా భిన్నంగా ఉంటుంది. నిత్యం స‌ముద్రంలోకి వేట‌కు వెళ్లి.. దొరికిన స‌ముద్ర సంప‌ద‌తో కూర‌లు వండుకుని తినే మ‌త్స్యకారులు సంక్రాంతికి మాత్రం స‌ముద్రం జోలికి వెళ్ల‌రు. అంతేకాదు, స‌ముద్రంలో దొరికే చేప‌ను కానీ, మిగిలిన జీవుల‌ను కానీ ముట్టుకోరు. వారు సంక్రాంతి స‌మ‌యంలో మేక‌లు గొర్రెలకే ప‌రిమిత‌మ‌వుతారు. ఇదేదో ఉత్తుత్తినే కాదు. కొన్ని త‌రాలుగా వ‌స్తున్న సంప్ర‌దాయం. అన్నిప్రాంతాల్లోనూ ఇంతే!

మరింత సమాచారం తెలుసుకోండి: