సాధారణంగా బాడీ బిల్డింగ్ చేసేవారు చేసే వ్యాయామం ఎంత కఠినంగా ఉంటుందో తెలిసిందే.  ఫిట్ నేస్ కోసం జిమ్, వ్యాయామ శాలలకు వెళ్లి కఠోర శ్రమ తీసుకుంటే వారికి అందమైన బాడీ రావడమే కాదు.. మంచి ఆరోగ్యంగా ఉంటారు.  ముఖ్యంగా యోగ, వ్యాయామం చేసేవారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు.. అందమన శరీర సౌష్టవాన్ని కూడా పొందుతారు.  సెలబ్రెటీలు ఈ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో ఇటీవల వారు రిలీజ్ చేస్తున్న వీడియోలను బట్టే తెలుస్తుంది.  అయితే మనుషులకు ఈ వ్యాయామం వల్ల కలిగే లాభాలు ఇలా ఉంటాయని తెలుసు.. కానీ కోడి పుంజులకు కూడా ఈ తరహా వ్యాయామాలు చేపిస్తారని మీకు తెలుసా?  అవును ఇప్పుడు సంక్రాంతి సీజన్ కోడి పందాల జోరు బాగా కొనసాగే సమయం.. పందెం రాయుళ్లు కోట్లల్లో కేవలం కోడి పందాలపై సంపాదించుకుంటారు. 

 

ఇందుకోసం తమ కోడిపుంజు బలంగా ఉండాలనే చూస్తుంటారు. ఇక వాటికి పెట్టే తిండి సాధారణ పౌరుడికి పెడితే కండ పుష్టితో బలంగా తయారవుతారు.  అలా కోడి పుంజులకు తిండి పెట్టడమే కాదు.. వాటికి దిమ్మతిరిగే వ్యాయామాలు కూడా చేయిస్తుంటారు. డెయిలీ ఎక్సర్‌ సైజులు.. బలమైన ఆహారం అందిస్తారు. అదే సమయంలో ఒంట్లో ఎక్కడా కొవ్వు దరిచేరకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ కొవ్వు ఉంటే ఫైటింగ్‌లో కోడి అలిసిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎంత తిండి పెడితే అంత వ్యాయామం చేయిస్తారు.

 

ఒక బాడీ బిల్డర్‌ కాంపిటీషన్‌కి ఎలా సన్నద్దం అవుతాడో... ఇంచుమించు అదే రకమైన ట్రైనింగ్‌ కోళ్లకు ఇస్తారు. చెస్ట్‌ పెరగడానికి బార్‌ డిప్స్‌.. కాళ్లు బలిష్టంగా ఉండాలంటే సిటప్స్‌, రన్నింగ్‌.. మెడ బలిష్టానికి నెక్‌ రాడ్‌ రొటేషన్‌.. భుజాల్లో బలం పెరగడానికి షోల్డర్‌ వర్కవుట్ చేస్తారు. వేర్వేరు ఎక్సర్‌ సైజులతో పందెం కోడిని ఓ బాడీ బిల్డర్‌గా తీర్చిదిద్దుతారు. ఇలా మనుషులకన్నా కోళ్లకు మంచి వ్యాయామం చేయించి కోట్లు సంపాదిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: