సంక్రాంతి అంటే కేవలం పండగే కాదు.. అది ఒక సరదాల, సంతోషాల వినోదాల కలయిక. ఎక్కడ చూసినా ఏ ఇంటి ముంగిట చూసినా గొబ్బెమ్మలు, ముగ్గులు, తోరణాలే కాదు. ఇంకా ఇంకా చెప్పుకునేందుకు చాలానే ఉన్నాయి. అసలు సంక్రాంతి పేరు చెబితే గుర్తుకు వచ్చేది పందేలు. పందేలు అంటే కోళ్ల పందేలు ఒక్కటే కాదు. కొన్ని ప్రాంతాల్లో అది కూడా మన ఏపీలో పందులు, పొట్టేళ్ల మధ్య కూడా పందేలు వేస్తూ ఉంటారు. వాటిపై పందేలు కాసి తెగ ఆనందపడిపోతుంటారు.ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో మేకలు, పొట్టేళ్ల పందేలు మరీ ఎక్కువగా జరుగుతుంటాయి. అనంతపురం జిల్లాల్లో అయితే పందుల పందేలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. 

 

గోదావరి జిల్లాల్లో కోడి పందేల సందడి మరీ ఎక్కువ. ఎక్కడ చూసినా ఇప్పుడు పందెం బిరిలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లక్షల్లో పందేలు అప్పుడే గోదావరి జిల్లాలో మొదలయ్యాయి. నా కోడి గొప్ప అంటే నా కోడి గొప్ప అన్నట్టుగా ఏవరికి వారు తమ గొప్ప చాటుకుంటున్నారు. వేల నుంచి లక్షలు, కోట్లు పందెలుగా కాసేందుకు వెనకాడడం లేదు.  ఈ పోటీలకు అధికారికంగా పర్మిషన్ లేకపోయినా అనధికారికంగా పందేలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు గుండాట మొదలయినవి ఉండనే ఉన్నాయి. 

 

ఇక పొట్టేళ్ల పందెం గురించి చెబితే మూడేళ్లుగా పొట్టేళ్ల పందేలు కూడా కోడిపందేలకు ఏమాత్రం తీసిపోకుండా జరుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట, వీరవాసరం, పాలకోడేరు, పెనుమంట్ర ప్రాంతాల్లో ఎక్కువగా పొట్టేళ్ల పందేలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ పొట్టేళ్ల పందేలపై కూడా పందేలు మొదలయ్యాయి. ఆ పందేలు కూడా లక్షల్లోనే జరుగుతుంటాయి. గతంలో పోటీల కోసం శ్రీకాకుళం, విజయనగరం నుంచి పొట్టేళ్లను తీసుకువచ్చి పందేలకు సిద్ధం చేసేవారు. కానీ ఇప్పుడు స్థానికంగానే పొట్టేళ్లను పందేంకు సిద్ధం చేస్తున్నారు.

 

పందుల పందెం : కోడి, పొట్టేళ్ల పందెల్లాగానే అనంతపురం జిల్లా తాడిపత్రిలో పందుల పందాలు బాగా ఫేమస్. ప్రతి ఏడాది సంక్రాంతికి పందుల పోటీలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా మారుతూ వస్తోంది. ఈ పోటీలు చూడడానికి కాస్త వెరైటీగా ఉండడం తో వీటిని చూసేందుకు జనాలు పోటీ పడుతుంటారు. ఇక పందేల సంగతంటారా వీటి మీద కూడా వేలు, లక్షల్లో జరిగిపోతూనే ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: