పండగ అంటే చాలు.. బస్టాండ్, రైల్వ స్టేషన్లు ఇలా ఎక్కడ చూసినా కూడా రద్దీ మామూలు గా లేదు.. జనాలతో ఎక్కడ చూసిన కిక్కిరిసి పోయింది.. అయితే ఇదే అదునుగా ప్రైవేట్ సంస్థలు కూడా అలానే సొమ్ము చేసుకోవడానికి జనాల పై బాదుడు వేస్తున్నారు.. అందుకే పండగ తప్పని పరిస్తితి ఎం చేయలేని పరిస్థితి కాబట్టి..ప్రజలు భారమైన కూడా భరిస్తున్నారు.. 

 

పాడి  పశువులకు, పాడి పంటలకు మరొక సంవత్సరం వరకు అంతా మంచే జరగాలి అంటూ ప్రజలు తమ బిడ్డలతో సమానంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఎక్కడెక్కడో ఉన్న వారంతా తమ స్వంత ఊరికి వెళ్లి ఈ పండుగను సంబరాలు చేసుకుంటారు. అందుకే బందు జనంతో ఈ పండుగ కళకళ లాడుతుంది. 

 

ఇది ఇలా ఉండగా ఈ పండుగ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది కోడి పందాలు, గంగిరెద్దులు.. ఈ సంక్రాంతికి కోడి పందాలు పేరుతో డబ్బులు కోట్లల్లో చేతులు మారుతాయన్న విషయం కూడా తెలిసిందే. కాగా, ఇప్పుడు ఈ పందాలకు కోడిపందాల బరులకు బదులు, 'సంక్రాంతి క్రీడా పోటీలు' అంటూ ప్లెక్సీలు ముద్రించి, అనధికారికంగా పందెం బరులను సిద్ధం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని గన్నవరం, తోట్లవల్లూరు, ఆత్కూరు, కంకిపాడు, నున్న తదితర ప్రాంతాల్లో పలు చోట్ల స్థలాలను శుభ్రం చేసి, భారీ టెంట్లు వేసి, చుట్టూ కంచెలు ఏర్పాటు చేశారు.

 

ఏమాట‌కు ఆమాటే చెప్పుకోవాలి. ప్ర‌జ‌ల సంబ‌రాల‌ను చ‌ట్టం తుడిచి వేస్తుందా?  చెప్పండి. అందుకే కోడి పందేల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ .. హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్‌పై విచార‌ణ ఈ నెల 17కు వాయిదా పడింది. అంటే.. ఓ నాలుగు రోజులు చ‌ట్టం సైలెంట్ అన్న‌మాట‌! బాగుంది క‌దూ! ఇక‌, పందేలు వేసేసుకుందామా!

మరింత సమాచారం తెలుసుకోండి: