పూర్వకాలంలో సెక్స్ అంటే అదొక రహస్య విషయం అన్నట్లు నాలుగు గదుల మధ్య మాత్రమే ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయాక టెక్నికల్‌గా చాలా అభివృద్ధి చెందాక. కొన్ని కొన్ని ఎవ్వరికి తెలియని విషయాలు కూడా అందరికి తెలిసేలా ఉంటున్నాయి కొన్ని యాప్స్. ప్రస్తుతం జనరేషన్లో స్టార్ట్‌ఫోన్ వాడని వారు ఎవ్వరూ ఉండరు. తెల్లారి లేస్తే చాలు ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరు మాట్లాడుకున్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్ ని మాత్రం వదలడం లేదు. అంతలాగా స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువయిపోయింది.
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు అందులో తెలియని విషయాలంటూ ఏమీ ఉండవు. ఆఖరికి శృంగారాన్ని కూడా స్మార్ట్ ఫోన్లో కానిచ్చేస్తున్నారు కొంత మంది యువత. శృంగారమేంటి... స్మార్ట్‌ఫోన్ ఏంటి అనుకుంటున్నారా... అవును ఇది నిజం. ఇటీవలె అమెరికాకు చెందిన ఓ సంస్థ చేపట్టిన సర్వే ద్వారా ఈ విషయం తెలిసింది. ప్రస్తుతం యువత కొన్ని భావోద్రేకాలను అదుపు చేసుకోలేక ఫోన్లోనే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు. అదెలా అంటే వాట్సాప్, సోషల్ మీడియా అప్లికేషన్స్ ద్వారా సెక్స్ చాట్ చేస్తున్నారు. అయితే ఈ సెక్స్ చాట్చేసే అలవాటు చాలా మందిలో ఉందని మెజార్జీ యువత ఒప్పుకుంది. మరికొంత మంది ఇంకాస్త అడుగు ముందుకేసి నగ్న చిత్రాలను ఈ ఫోన్లో పంపుకుంటున్నారు. అలా పంపేవారి జాబితా కూడా 50 కి పైగా ఉన్నారు.
అదే విధంగా కొంత పైశాచికంగా కనిపించే అప్పటివాళ్ళకు నేటి యువత సెక్స్ చేసేటప్పుడు ఏకంగా వీడియోలను కూడా తీసుకుంటున్నారు. అలా చేయడం వల్ల తమ పార్ట్నర్కి దూరంగా ఉన్నప్పుడు వాటిని చూస్తూ తృప్తి పడతామని కొందరు తెలుపుతున్నారు. అయితే ఒకరకంగా చూస్తే ఇది అస్సలు మంచిది కాదు దీన్ని అడ్డుగా పెట్టుకుని కొంత మంది కొన్ని అరాచకాలకు కూడా పాల్పడేవారు ఉన్నారు.