సంక్రాంతి సరదాల్లో కోడి పందేలు ఒకటి. ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో ఈ కోడి పందేల సందడి అంతా ఇంతా కాదు.. వీటి కోసం ప్రత్యేక మైన ఏర్పాట్లు ఉంటాయి. సామాన్యుడి దగ్గర నుంచి వీవీఐపీల వరకూ ఈ కోడి పందేలకు వస్తారు. ప్రత్యేకమైన బరులు ఏర్పాటు చేస్తారు.

 

కొన్ని చోట్ల ఏకంగా ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తారు. అందుకే ఈ సందడిని అస్సలు మిస్ కాకూడదు. కోడి పందాలు చూడండి...! మన తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలకు ఎక్కడా కొదవ లేదు. చక్కగా అందరూ కలిసి సంతోషంగా కోడి పందాలకు వెళ్ళండి.అయితే ఇక్కడ ఓ కండిషన్ అప్లయ్ అవుతుంది.


అదేంటంటే.. కోడి పందేల పేరుతో డబ్బులు వృధా చేసుకోకుండా సంతోషంగా ఉండండి. పందేలు చూసేందుకే తప్ప.. విచ్చలవిడిగా పందేలు కాయడానికి కాదు. అలాగే కోడిపందేల సమయంలో పోలీసుల రెయిడింగులు ఉంటాయి. ఆ సమయంలో జనం తొక్కిసలాట ఉంటుంది. కాస్త జాగ్రత్త.

 

ఇక ఈ పందేలకు చిన్న పిల్లలను తీసుకెళ్లకండి.. అలాగే అక్కడ దొరికే చిరుతిళ్లు తినకండి.. అలాగే గుండాట వంటి జూదాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. వాటి జోలికి వెళ్లారో ఇక మీ జేబు గుల్లే. ఈ జాగ్రత్తలు పాటిస్తే కోడిపందేలు కూడా ఆనందం పంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: