పండ‌గ పూట ఇంట్లో ఇష్ట‌మైన వంట‌కాలు...బ‌య‌ట పార్టీలు నేటి రోజుల్లో సాధార‌ణం అయిపోయాయి. అయితే, పండుగ రోజ‌యినా...సాధార‌ణ రోజుల్లో అయినా మ‌న‌కు ఆరోగ్యం ముఖ్యం క‌దా?  పండుగ పూట పుష్టిగా, తృప్తిగా తిన‌టంలో త‌ప్పేమీ లేదు. అయితే, ర‌క‌ర‌కాల తిండిల‌తో ఇప్ప‌టికే శ‌రీరం అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కుంటోంది. ఇందులో బ‌రువు ముఖ్య‌మైన‌ది. బ‌రువును త‌గ్గించుకునేందుకు తిండి మానుకోవాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రి ఏం చేయాలంటే...ఇలా చేయాలి.

 


అధిక బరువు అనేక మంది స‌మ‌స్య‌. అయితే, బ‌రువు తగ్గేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. నిత్యం వ్యాయామం చేయడంతోపాటు కింద తెలిపిన ఆహారాలను తీసుకోవాలి. వ్యాయామం వ‌ల్ల క్యాల‌రీలు ఖ‌ర్చు అవుతాయి. అయితే,  మన శరీరం క్యాలరీలను ఎక్కువగా ఖర్చు చేయాలంటే.. శరీర మెటబాలిజం పెరగాలన్న సంగతి తెలిసిందే. దీంతో మనం తినే ఆహారం త్వరగా జీర్ణమై ఆ తరువాత వచ్చే శక్తి క్యాలరీల రూపంలో త్వరగా ఖర్చవుతుంది. ఫలితంగా శరీరంలో ఉండే కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. 

 


- చాలా సుల‌భ‌మైన అంశం మొద‌ట తెలుసుకుందాం. గోరు వెచ్చని నీటిని నిత్యం తాగడం వల్ల కూడా శరీర మెటబాలిజం పెరుగుతుంది. రోజూ సాధారణ నీటికి బదులుగా గోరు వెచ్చని నీటిని తాగితే నెలకు 1 నుంచి 2 కిలోల వరకు బరువు తగ్గవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. 


- ఇక ఆహారం విష‌యానికి వ‌స్తే,  ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఎందుకంటే ప్రోటీన్లను జీర్ణం చేయడం కోసం శరీరం ఎక్కువగా క్యాలరీలను ఖర్చు చేస్తుంది. అలాగే ప్రోటీన్ల వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. 


- ఆహారంతో పాటుగా రిలాక్స్ అవ్వ‌డం ద్వారా కూడా బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు. ఎలా అంటే..నిత్యం 2 లేదా 3 కప్పుల కాఫీ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. కాఫీ తాగడం వల్ల శరీర మెబటాలిజం పెరిగి క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫలితంగా అధిక బరువు కూడా తగ్గుతారని సైంటిస్టులు చేపట్టిన పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

 

- ఇక మ‌రో అంశం యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌. నిత్యం ఉదయాన్నే ఒక గ్లాస్‌ నీటిలో రెండు టేబుల్‌ స్పూన్ల యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను కలుపుకుని తాగితే మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చయి బరువు తగ్గుతారు.సో..వీటిని పాటించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: