పండుగ అంటేనే సంబరం.. కానీ ఆ సంబరం మనొక్కరిదేనా. మనం, మన కుటుంబం సంతోషంగా ఉంటే చాలా.. మన భారతీయ జీవన విధానం.. జీవించు.. జీవించనివ్వు.. నవ్వు.. నవ్వించు.. ఇవన్నీ మన సంస్కృతిలో భాగమే. అందుకే పండుగలు, పబ్బాలప్పుడు చేతనైనంత వరకూ దానం చేయమని చెబుతుంటారు.

 

ఈ తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి వేళ కూడా అలాంటి దానాలు ఉన్నాయి. ఆ దానాల ప్రాశస్త్యం ఏంటో చూడండి.. సంక్రాంతి వేళ నువ్వులను దానం చేస్తే శని దోషం తొలగిపోతుంది. ఈ దానం ద్వారా మనస్తాపాలు తొలిగిపోయి ఆరోగ్యం కలుగుతుంది. నువ్వుల దానం ఈ దానం ద్వారా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు.

 

నువ్వులను దానం చేస్తే శరీరంలోని మాంసదోషం కూడా తొలగుతుందట. ఇంకో దానం బెల్లం. దీన్ని దానం చేస్తే సంతానం కలుగుతుంది. వంశం వృద్ధి చెందుతుంది. ఈ ఫలితాలు ఇచ్చిన వారికే కాదు. దానం పొందిన వారికి కూడా ఫలితమిస్తాయి.

 

ఈ దానాలు చేస్తూ శక్తి కొలది మిగిలిన దానాలు కూడా చేయవచ్చు. సంక్రాంతి వేళ పై దానాలు చేస్తూ పితృ దేవతలకు నైవేద్యం పెట్టాలి. సంక్రాంతి వేళనే శ్రీహరి భూమిని సముద్రం నుంచి పైకి తీసుకువచ్చాడు. అందుకే.. నువ్వులు, బెల్లం దానం చేస్తే.. భూదానం చేసినంత ఫలితం వస్తుందట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: