అవును.. ఈ మాట రోజూ తప్పనిసరగా చెప్పండి.. ఎవరికి అంటారా.. ఎవరికో కాదు.. మీకే.. అవును.. నిజమే.. ఈ మాట మీకు మీరు తప్పకుండా చెప్పుకోండి.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. ఈ మాట ప్రతి ఒక్కరు తనతో తాను ప్రతిరోజూ అనుకోవాలి. ఎందుకంటే.. ఎవరిని వారు ప్రేమించుకోగలిగితే వారిలో అనుకూలభావాలు పెరుగుతాయి.

 

 

అప్పుడే మనం మన కుటుంబాన్నీ ప్రేమగా, ఆరోగ్యంగా ఉంచుకోగలం. ఇదంతా జరగాలంటే.. ముందు మన ఆరోగ్యం పట్ల అవగాహనతో అడుగులు వేయాలి. మీ వయసుని బట్టి కొన్ని రకాల వైద్యపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. మనం అందరినీ పట్టించుకుని మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు.

 

 

అందుకే.. చక్కని ఆహారం తీసుకుంటూ హార్మోన్ల అసమతుల్యత, నిద్రలేమి, ఒత్తిడి వంటి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. వారంలో కనీసం నాలుగు రోజులు..అది కూడా కనీసం అరగంట సేపు నడక, పరుగు ఏదో ఒకటి చేయాలి.. లేదంటే జిమ్‌కు వెళ్లాలి. లేదంటే మీ శారీరక సామర్థ్యం తగ్గుతుంది. అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలెదురవుతాయి.

 

 

ఇప్పటి బిజీ జీవితాల్లో అందరిలోనూ మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఈ దశలో కొత్తప్రాంతాలను పర్యటించాలి. ఒంటరితనం, మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలి. మీరు చేరాలనుకునే లక్ష్యాలు, సంతోషంగా జీవించాలనే ఆశయానికి మీ శారీరక సామర్థ్యం తోడయ్యేలా జాగ్రత్తపడాలి. అప్పుడే కదా.. ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం అయ్యేది. అందుకే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: