భిన్నత్వంలోనే ఏకత్వం భారతదేశం గొప్పతనమని.. ఇక్కడ అన్ని మతాల వారు అన్ని రకాల సాంప్రదాయాలకు పెట్టింది పేరు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రాంతాల వారు పతంగుల పండుగ చేసుకుంటారు.   ఇక సంక్రాంతి పండుగ సందర్బంగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంత సంబురంగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కోళ్లపందెం, ఎడ్ల పందాలు జోరుగా కొనసాగుతాయి.  ఇక పట్టణాల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా పతంగులు ఎగురవేయడం చూస్తూనే ఉంటాం.  గాల్లో విభిన్న ఆకృతుల్లో రంగురంగుల పతంగులు ఎగురవేయడం కన్నుల పండువగా కనిపిస్తుంది. ఆకాశంలో.. పతంగులు గిరికీలూ కొట్టాయి చూసిన పెద్దోళ్లంతా ప్రాయం మరిచి కాసేపు పిల్లలైపోయారు! పిల్లలైతే అంతులేని ఆనందంతో కేరింతలు కొట్టారు. 

 

తెలుగు వారి పండుగ‌ల్లో ప్ర‌ధాన‌మైన సంక్రాంతిపై ఉత్త‌రాధి ప్ర‌భావం క‌నిపిస్తోంది. గాలి ప‌టాల‌ను ఎగుర‌వేయ‌డం అనేది ఉత్త‌రాది సంప్ర‌దాయం. ఇది మ‌న వైపు కొన్నేళ్లుగా క‌నిపిస్తోంది. త‌ప్పు కాన‌ప్ప‌టికీ.. మ‌న సంస్కృతిని నిల‌బెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ పర్వదినం సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన సెలవుల్లో పిల్లలు పతంగుల ఎగురవేయడం  బిజీ బిజీగా ఉంటారు.  ఇందుకోసం మాంజా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మాంజా ఒకప్పుడు దేశావాలి ఉపయోగించేవారు.. కొంత కాలంగా చైనా నుంచి వైర్ మాంజా అంటూ రావడం.. వాటితో కాలుష్యం పై తీవ్ర ప్రభావం పడటంతో ఇక్కడ నిషేదించారు.

 

అయితే పతంగులు ఎగురువేయడం వాస్తవానికి ఉత్తరాది సాంప్రదాయం.. అయితే ఈ సాంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లోకి రావడం.. వ్యాపార పరంగా దీన్ని అభివృద్ది చేశారు. ఈ సాంప్రదాయం తెలుగు వారు జరుపుకోవడం తప్పుకాకపోయినా.. అక్కడి సాంప్రదాయం ఇక్కడ డామినేట్ చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.  ఇక ఇక్కడి తెలుగు సాంప్రదాయాలు..  బసవన్నలు చిందులు వేయడం ఆనవాయితీ. సంక్రాంతి రోజున గంగిరెద్దులు సందడి చేస్తాయి. అయ్యగారికి దండం పెట్టు అటూ గంగిరెద్దుల వాళ్లు గంగిరెద్దులను ఆడించడంతో సంక్రాంతి పర్వదినం వర్ణశోభితంగా మారుతుంది. హరిదాసులు ఇంటి వద్దకు రావడం.. కొన్నాళ్లుగా పట్టణాల్లో కంటికి కనిపించకుండా పోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: