సంక్రాంతి అనగానే మనకి ఎక్కువ గుర్తువచ్చేది ముగ్గులు. సాధారణంగా మనము పల్లెలో తెల్లవారు జామునే లేసి ప్రతి ఇంటి ముందు పేడతో కల్లాపు జల్లి ఆడపడుచులు చక్కగా ముగ్గులు వేయడం చూస్తూ ఉంటాము. మనము ఎక్కువగా చూసేది పల్ల్లెల్లోనే.... ఇంకా మారుతున్నా కాలం ప్రకారం అందరు సిటి లైఫ్ కి అలవటు పడి కొంతమందికి ముగ్గులు అంటేనే ఏంటి అవి? ఎలా వేస్తారు అనే సంభ్రమాశ్చర్యంలో ఉంది ఇప్పటి జనేరషన్.

 

అసలు విషయానికి వస్తే కనుక ముగ్గు మనం లక్ష్మి దేవి తో సమానం, అందుకే స్రిలు తెల్లవారు జామునే లేసి చక్కగా ఇంటి ముందు ముగ్గులతో అలకరిస్తారు మనం మన ఇంటిని మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎంత బాగా ఉంచితే లక్ష్మి దేవి కొలువై ఉంటుందని శాస్రాలు చెప్తున్నాయి.

 

సంక్రాంతి పండురోజు వేసే ముగ్గులు అనేక అర్ధాలకు సూచిస్తాయని చరిత్ర చెబుతోందిగ్యాప్ లేకుండా అలిన దాన్ని మేఘాలు లేని ఆకాశం అని ఒక పద్దతిలో పెట్టబడిన చుక్కలు నక్షత్రాలకు సంకేతం అని…. చుక్కల చుట్టు తిరుగుతూ చుక్కలను గళ్లలో ఇమిడ్చే ముగ్గును ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పు సంకేతమని అంటుంటారు పెద్దలు

 

అలాగే ముగ్గు మధ్యలో చుక్క సూర్యుడికి సంకేతం అని అంటుంటారుఅలాగే భిన్న ఆలోచనలకు సంకేతం అని అంటున్నారు మూడురోజులు ముగ్గులతో ఆనందాన్ని పంచే పండుగ సంక్రాంతి పండుగగా భావిస్తారు.

 

ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. పేడ కళ్లాపి ముంగిలిలో తోచిన ముగ్గును ముచ్చటగా తీర్చిదిద్దితే! ఎలా కుదిరినా వర్ణశోభితమే! ఎందుకంటే, అది మనం స్వయంగా 'ముగ్గు' ఓడ్చి తీర్చిదిద్దిన వర్ణచిత్రం! నేలమ్మ నుదుట తిలకంలా శోభిల్లే రంగవల్లికలు మనసుకు పంచే ఆహ్లాదం చెప్పతరం కాదు

 

మరింత సమాచారం తెలుసుకోండి: