సంక్రాంతి వచ్చింది అంటే చాలు రంగవల్లులు... పచ్చని. తోరణాలు.. హరిదాసుల కీర్తనలు.. బంధువుల సందడి.. పనివాళ్ళు చేసే హడావిడి.. ఎగిరే గాలిపటాలు.. ఇవన్నీ సరదాలు తీర్చుకునే ఒక పండుగ ఈ సంక్రాంతి.. ఈ సంక్రాంతిని మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండోవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ ఇలా జరుపుకుంటారు.. ఇకపోతే ఈ సంక్రాంతి పండుగకు చాలా సరదాలు ఉంటాయి.. 

 

 

పచ్చని పొలాలు ముగ్గులు గొబ్బెమ్మలు ఇలా ఒకటేమిటి అన్నీ ఈ పండుగ నాడు జరుగుతాయి..పట్టణాలలో ఉన్న వాళ్లంతా పల్లెకు పయణమవుతారు..ఎన్నో రకాల పిండి వంటలు ఈ పండుగ నాడు కనిపిస్తాయి. ఇకపోతే మామూలు సమయాల్లోనే తెలుగింటి ఆడపడుచులు రంగవల్లి తో ఇంటికి ఒక హంగును తీసుకొస్తారు.. ఈ పండుగకు మరింత ప్రత్యేకం అని చెప్పాలి..అందుకే సినిమాలు కూడా ఈ సంక్రాంతి పండుగ నాడే ఎక్కువగా కనిపిస్తాయి..

 

పిండి వంటలు తింటూ పండగని ఆస్వాదించండి. పండగ అనగానే మనకు ఏంటి...? ముఖ్యంగా సంక్రాంతి పండగ అనగానే పిండి వంటలు, అరిసెలు, కారపూస, కొబ్బరి బూరెలు, లడ్డూలు ఇలా ఎన్నో రకాల పిండి వంటలు మనకు ఉన్నాయి. పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలే కాదు. పిండి వంటలు చాలా బాగుంటాయి.

 

ఇప్పుడు గ్రామీణ ప్ర‌జ‌లంతా కూడా దాదాపు ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లోనే ఉంటుండ‌డంతో సంప్ర‌దాయాల‌ను పాటించేవారుతెలిసిన వారు కూడా క‌రువ‌వుతున్నారు. పట్టణీకరణ ను దృష్టిలో పెట్టుకొని చాలా వరకు పల్లెలు కరువయ్యాయి.. అందుకే పండగలకున్న ప్రత్యేకత కూడా తగ్గిపోయింది.. అందుకే ఈ పండుగల చేసుకునే వారు ఎక్కడో మారు మూల ప్రాంతాల్లో కనిపిస్తారు.. మొత్తానికి అలా ఈ పండుగలు ఇప్పుడు జరుగుతున్నాయి.. అదండీ ఇప్పుడు పండుగలు..

మరింత సమాచారం తెలుసుకోండి: