ఈ మ‌ధ్య దొంగ‌లు చేసే ఆగ‌డాలు అంతా ఇంతా కాదు. దొంగ‌త‌నం, దోపిడీల కోసం ఎంత‌టి ప‌ని చేయ‌డానికైనా ఒడిగ‌డుతున్నారు. ఎలాంటి ప‌నినైనా స‌రే ఏమీ ఆలోచించ‌కుండా చేసేస్తున్నారు. కొంద‌రైతే ఏకంగా డ‌బ్బుల కోసం మ‌నుషుల‌ను చంప‌డానికి కూడా వెన‌కాడ‌డం లేదు. ఇక ఇదిలా ఉంటే... ఈ మ‌ధ్య నెల్లూరులో ఇలాంటి ధారుణ‌మైన ఘ‌ట‌న ఒకటి చోటు చేసుకుంది. 

 

ఎంతో అందంగా ఎక్క‌డా డ‌వుట్ అనేది రాకుండా ఆడ‌వారి కంటే ఎక్క‌వ‌గా అలంక‌రించుకుని న‌డిరోడ్డు పైన నిల‌బ‌డుతున్నారు. వ‌చ్చే పోయే వెహిక‌ల్స్‌ని లిఫ్ట్ కోస‌మో లేదంటే... మ‌రేదో అవ‌స‌ర‌మ‌ని బండ్ల‌ని ఆపుతున్నారు. ఎవ‌రైనా టెంప్ట్ అయి పొర‌పాటున బండి ఆపారా... ఇక అంతే సంగ‌తులు నిలువ దోపిడీకి పాల్ప‌డ‌తారు. ముందు ఎంతో టెక్‌నిక్‌గా వాలు జ‌డ వేసుకుని, అంద‌మైన చీర‌ను అలంక‌రించుకుని. ఆడ‌వారికి కూడా అసూయ పుట్టేంత అందంగా రెడీ అయి వ‌చ్చే పోయే బండ్ల‌ను కవ్వించే చేష్ట‌ల‌తో కైపెక్కిస్తారు. నెల్లూరు హైవే పై మహిళ‌ల వేష‌ధార‌ణ‌లో దారి దోపిడీలు చేస్తున్నార‌ని పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. 

 

వీరిలో ఒకరు చీరకట్టుకొని మహిళా వేషంలో వెహికిల్స్ ఆపడం ఆ వెంటనే మిగతా అందరూ వచ్చి దోచుకెళ్లడం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నగరంలోని ఆకుతోట వీధికి చెందిన ఈ నకిలీ లేడీస్ సంక్రాంతి ఖర్చుల కోసమే ఈ పనిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు శ్రీరామ్, వెంకటరమణ, రాజా, కంపా వెంకటేశ్వర్లుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి నగదు,  కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  ఇలాంటి అరాచ‌కాల‌కు పాల్ప‌డ్డ వారి పై పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటే కానీ.. ఇలాంటి ఆగ‌డాలు ఆగ‌వు.

మరింత సమాచారం తెలుసుకోండి: