ఎక్కడైనా పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది.. ఆనవాయితీగా వస్తున్న ఆచారం అది..పోతే పెళ్లి అనేది జీవితంలో ఎనలేని మర్చిపోలేని ఘట్టం.. అందుకే పెళ్లంటే నూరేళ్ళ పంట అంటున్నారు..  అయితే మగాడు ఈ పెళ్లిని జీవితంలో ఒక్కసారి ఒకరితో మాత్రం చేసుకుంటాడు. మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఒకరితో నే జరగాలి.. కానీ ఈ మధ్య కొంచెం మారింది. ఒకరు పోతే మరొకరు అంటూ పెళ్లిళ్లు చేసుకుంటూ వస్తున్నారు..

 

అయితే ఒక ప్రాంతంలో మూడో పెళ్లి కానీ నాలుగో పెళ్లి కానీ చేసుకునే వారికి కళ్యాణ మడపం ఫ్రీ అట..ఈ ఆఫర్ మీ కోసమే. మూడో పెళ్లి.. నాలుగో పెళ్లయినా సరే ఈ ఆఫర్ వర్తిస్తుంది’’ అంటూ ఓ కళ్యాణ మండపం నిర్వాహకులు ప్రకటించారు. ఔనా, ఇంతకీ ఏమిటీ ఆ ఆఫర్? ఓసారి ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే, మీరు పాకిస్థాన్‌కు బయల్దేరాలి.

 

వివరాల్లోకి వెళితే..నైలా ఇనాయత్ అనే ఓ పాకిస్థానీ టీవీ రిపోర్టర్ ఈ ఫన్నీ ప్రకటనను ట్వీట్ చేసింది. ‘‘బంపర్ వెడ్డింగ్ ఆఫర్, బవల్పూర్‌‌లోని కళ్యాణ మండపంలో రెండో పెళ్లి చేసుకొనేవారికి 50 శాతం, మూడో పెళ్లి చేసుకొనేవారికి 75 శాతం రాయితీ ఇస్తోంది. నాలుగో పెళ్లి చేసుకొనేవారు ఎలాంటి పైకం చెల్లించకుండా ఉచితంగా కళ్యాణ మండపాన్ని వాడుకోవచ్చు. మీకు సత్తా ఉంటే.. మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోడానికి ఈ కళ్యాణ మండపానికి రండి’’ అని పేర్కొంది.

 

ఇది ఇలా ఉండగా ఈ ట్వీట్ పెట్టిన కొద్ది క్షణాల్లో వైరల్ అవుతూ వచ్చింది.అయితే, ఫ్రీ కదా అని రెండో పెళ్లో లేక మూడో పేళ్లో చేసుకునే వారికి ఇది వర్తించదని అంటున్నారు.. పెళ్లి మండపం ఆఫర్‌లో లభిస్తోందని మొదటి భార్యకు విడాకులిచ్చి మరీ పెళ్లికి సిద్ధమయ్యేవారికి ఇది వర్తించదని యజమాని తెలిపాడు. ఎందుకంటే, ఈ పెళ్లి మండపాన్ని వరుడు బుక్ చేయడానికి వీలులేదు. అతడి మాజీ భార్య.. మరో పెళ్లికి అంగీకరిస్తూ పెళ్లి మండపాన్ని బుక్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఆఫర్ ఇండియాలో అయితే లేదు సంతోషించాలి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: