సంక్రాంతి పండుగ అంటే మూడు పండుగలు. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజులు ప్రతి ఇల్లూ ఆనందోత్సాహాల మద్య కల కలలాడుతుంటాయి.  ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో అలంకరించారు. మామిడి తోరణాలు, కొత్త అల్లుళ్ల సందడి, బావా మరదల్ల సరసరాలు, బంధువులతో సందడి సందడిగా మారుతుంది. కోళ్ల పందాలు, ఎద్దుల బల ప్రదర్శన, ఇతర ఆటలతో కోలాహాలంగా మారింది. పుష్యమాసం, హేమంత ‌ఋతువు, మంచు కురిసే సమయంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చది మకర సంక్రాంతి. గాలిపటాలు, బావా మరదళ్ల సరసాలు..ఇలా సంక్రాంతి సరదాలు ఎన్నో. ప్రధానంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారు. 

 

పండుగ రోజు ఎవరి స్థోమతను బట్టి వారు పిండివంటలు చేసుకుంటారు.  సున్నుండలు, అరిశెలు, జంతికలు, గోరువిటీలు, పూతరేకులు, పాకుండలు, బొబ్బట్లు, బూరెలు, గారెలు.. ఇలా ఒకటా రెండా.. ఎవరికిష్టమైన పిండి వంటలు వారు వండుకొంటారు. వాటిని ఇరుగుపొరుగు వారికి పంచిపెడతారు. సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్లు జోరు బాగా ఉంటుంది. మరదళ్ల సరసాలు.. బావమరదుల వేళాకోళాలు.. ఆ సరదానే వేరు. బావను ఆటపట్టించడం.. అవి కావాలి.. ఇవి కావాలంటూ..అల్లరి చేయడం చూస్తుంటాం. ఇక  అల్లుడి రాక.. ఆయనకు ఏది తగ్గినా అలక.. అయన్ని బుజ్జగించడానికి అత్తమామల పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొత్త బట్టలు.. కొత్త వాహనాలు ఇలా ఏన్నో సమర్పించుకుంటారు.

 

మొత్తానికి కొత్త అల్లుళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తుంటారు. అయితే మారుతున్న కాలంతో పాటు ఆర్థిక ప‌రిస్థితులు కూడా గ‌డ్డుగా ఉంటున్నాయి. మ‌ధ్య‌త‌ర‌గ‌తిలో ఎవ‌రు ఓ ల‌క్ష‌రూపాయ‌లు వెనుకేయాల‌న్నా అంత తేలిక విష‌యం కాదు. ఎవరికైనా ఇబ్బందులు సహజం..  సో.. అల్లుళ్లూ కొంత మారాలి. మీ క‌ష్టార్జితాన్ని న‌మ్ముకుని ఎదిగేందుకు ప్ర‌య‌త్నించాలి. అత్త‌గారు, మామ‌గారు సంతోషంగా పెట్టింది, ఇచ్చింది తీసుకుని సంత‌సించాలి. అల‌క‌లు మానుకోవాలి!!

మరింత సమాచారం తెలుసుకోండి: