మ‌న జీవ‌న విధానంలో భాగ‌మైన వాటిల్లో ఏది తింటే ఏం జ‌రుగుతుందో అని బెంగ ప‌డాల్సిన ప‌రిస్థితుల్లో ప్ర‌స్తుతం మ‌నం ఉన్నాం అనేది నిజం. ఇలాంటి షాకుల ప‌రంప‌ర‌లో తాజాగా కొత్త అంశం ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. స‌హ‌జంగా తియ్య‌ని పదార్ధాలు  ఎక్కువగా తింటే మ‌ధుమేహం (చ‌క్కెర‌) వ్యాధి వస్తుందని అందరూ అనుకుంటారు. అయితే తీపి పదార్ధాలు తింటేనే కాదు… ఉప్పు అధికంగా తిన్నా షుగర్ వస్తుందట.

 

స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ నిర్వహించిన రీసెర్చ్‌లో తాజాగా ఆస‌క్తిక‌ర విష‌యాలు తేలాయి. ఉప్పు ద్వారా లభించే సోడియంను తక్కువ మొత్తంలో తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు సుమారు 2,800 మిల్లీ గ్రాములు, అంతకంటే ఎక్కువ తీసుకునేవారిలో చెక్కర వ్యాధి వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు తేల్చిచెప్పారు. ఉప్పు ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్‌ను నిరోధిస్తోందని… ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుందన్నారు. అంతేకాదు ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడంతో రక్తపోటుకు గురికావడంతో పాటు బరువు కూడా పెరగుతారని, డయాబెటిస్ కు ఇవి రెండూ ప్రమాదమేనన్నారు. రోజుకు 2300 మిల్లీ గ్రాములకు మించి శరీరంలోకి ఉప్పు చేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

 

కాగా,‘పియర్​’ పండ్లు. తక్కువ తీపితో రుచిగా ఉండే పియర్​ పండ్లను తింటే… బరువు తగ్గడమే కాదు, టైప్– 2 డయాబెటిస్, గుండె జబ్బులు కూడా తగ్గుతాయట. వాటిలో ఉండే ఫైబర్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.178 గ్రాముల పియర్​ పండులో 101 క్యాలరీలతోపాటు 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. యాపిల్ పండులాగే… చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి పియర్​ పండ్లు. ఎవరైనా వీటిని తినొచ్చు. అందుకే వీటిని సూపర్ ఫుడ్‌‌గా పిలుస్తారు. పియర్స్‌‌లో క్యాల్షియం, ఫొలేట్​, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్​ C, E, K ఉంటాయి. అలాగే బీటా-కెరోటిన్, ల్యూటెయిన్, రెటినాల్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. రెగ్యులర్‌‌గా పియర్స్ తినడం వల్ల బరువు తగ్గుతున్నట్లు, టైప్– 2 డయాబెటిస్, గుండె జబ్బుల వంటివి నయమవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: